నేడు చంద్రగ్రహణం | lunar eclipse today | Sakshi
Sakshi News home page

నేడు చంద్రగ్రహణం

Published Sat, Apr 4 2015 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

యాదాద్రి ఆలయం (ఫైల్)

యాదాద్రి ఆలయం (ఫైల్)

సాక్షి, హైదరాబాద్: శనివారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.17 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. కన్య, తుల, కుంభ, మిథున రాశులపై దాని ప్రభావం ఉంటుందని వేదపండితులు పేర్కొంటున్నారు. కన్యారాశిలోని హస్త నక్షత్రంపై గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గర్భిణులు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం చేసి గ్రహణ సమయంలో సూర్యకాంతి శరీరంపై పడకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆలయాలను మూసివేయనున్నారు. గ్రహణానంతరం సం ప్రోక్షణ జరిపాక భక్తులకు దర్శనం కల్పిస్తారు.
 
 ఆలయాల మూసివేత ఇలా...
 తిరుమల: ఉదయం 9.30- రాత్రి 8.30 దాకా
 యాదగిరిగుట్ట: ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం దాకా
 భద్రాచలం: మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7.45 దాకా
 కనకదుర్గ (విజయవాడ): ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 4 దాకా
 సింహాచలం: ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 6.30 దాకా
 ధర్మపురి: ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా
 అన్నవరం: ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 5.30 దాకా
 కాణిపాకం: ఉదయం 8 నుంచి రాత్రి 8.30 దాకా
 కొండగట్టు: ఉదయం 8.30 నుంచి ఆదివారం వేకువజాము 3 దాకా
 శ్రీశైలం: ఉదయం 6.30 నుంచి రాత్రి 8 దాకా
 వేములవాడ: ఉదయం 4 నుంచి రాత్రి 8.05 దాకా
 కాళేశ్వరం: ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 4 దాకా
 భద్రకాళి (వరంగల్): ఉదయం 11 నుంచి రాత్రి 7 దాకా
 (శ్రీకాళహస్తి ఆలయం మాత్రం శనివారమంతా తెరిచే ఉంటుంది. రాహు కేతు క్షేత్రం కాబట్టి ఈ ఆలయానికి గ్రహణం ప్రభావముండదని అర్చకులు తెలిపారు. శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement