ఆగస్టు 7న దుర్గగుడి మూసివేత
చంద్రగ్రహణం ఏర్పడటమే కారణం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఆగస్టు ఏడో తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానాన్ని మూసివేస్తారు. ఏడో తేదీ ఉదయం 11.30 గంటలకు దుర్గగుడిలో అన్ని దర్శనాలను నిలిపివేసి ఆలయాన్ని శుభ్రం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన తర్వాత అమ్మవారి ఆలయ ద్వారాలను మూసివేస్తారు.
రాత్రి 10.52 నుంచి అర్ధరాత్రి 12.48 గంటల వరకు గ్రహణం ఉంటుందని దుర్గగుడి స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ తెలిపారు. ఆగస్టు 8వ తేదీ ఉదయం ఆరు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు.