ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌తో ఉన్న కీలక సరిహద్దు చమన్ క్రాసింగ్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు గురువారం పాకిస్తాన్ ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక పాలన భయంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సరిహద్దులు దాటి వచ్చే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారని జియో న్యూస్ తెలిపింది. పాక్ బాట పట్టిన వేలాదిమంది అఫ్గాన్లు ఇప్పటికే చమన్ వద్ద పడిగాపులు కాస్తుండగా, వీరందరినీ తాము అనుమతించే పరిస్థితుల్లో లేమని పాక్ అధికారులు అంటున్నారు. సరిహద్దుల్లో ఆంక్షలు సడలిస్తే 10 లక్షల మందైనా అఫ్గాన్లు వచ్చే అవకాశం ఉందని పాక్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో 90% వరకు ఫెన్సింగ్ ఉంది. 12 చోట్ల ఏర్పాటు చేసిన చెక్‌పాయింట్ల ద్వారా సరైన ప్రయాణ పత్రాలున్న వారినే ప్రస్తుతం పాక్‌లోకి అనుమతిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment