తెగని టికెట్లు.. ద.మ. రైల్వే కీలక నిర్ణయం.. 23 రైల్వేస్టేషన్ల మూసివేత | Closure of 23 railway stations | Sakshi
Sakshi News home page

తెగని టికెట్లు.. ద.మ. రైల్వే కీలక నిర్ణయం.. 23 రైల్వేస్టేషన్ల మూసివేత

Published Fri, Jun 30 2023 4:32 AM | Last Updated on Fri, Jun 30 2023 8:42 PM

Closure of 23 railway stations - Sakshi

ఏలూరు (టూటౌన్‌): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలోని 23 రైల్వేస్టేషన్లను మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 23 స్టేషన్లు మూతపడ్డాయి. ఇప్పటికే ఈ స్టేషన్ల పరిధిలోని సిబ్బందిని చాలా వరకు ఇతర రైల్వే స్టేషన్లకు సర్దుబాటు చేశారు.

రవాణా సాధనాలు పెరగడం, రోడ్డు మార్గాలు అందుబాటులోకి రావడంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగే స్టేషన్లు మినహా ప్యాసింజర్‌ రైళ్లు ఆగే వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికుల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 

మూసివేతకు కారణాలివీ..
కనీసం రోజుకు 25 మంది ప్రయాణికులు కూడా రాకపోకలు సాగించని రైల్వే స్టేషన్లను మూసివేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రోజుకు ఒకటి, రెండు టికెట్లు మాత్రమే అమ్ముడవుతున్న చోట్ల బుకింగ్స్‌ నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారు. 

మూసివేసిన స్టేషన్లు ఇవే..
మే 1వ తేదీ విజయవాడ డివిజన్‌ పరిధిలోని ఎన్‌ఎస్‌జీ–6 కేటగిరీలో ఉన్న 16 స్టేషన్ల మూసివేతకు తొలుత డ్రా‹ఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అభ్యంతరాలేవీ రాకపోవడంతో అల్లూరు రోడ్డు, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద, నవాబ్‌పాలెం, పెన్నాడ అగ్రహారం, పెద అవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీ వెంకటేశ్వరపాలెం, తాలమంచి, తేలప్రోలు, వట్లూరు రైల్వే స్టేషన్లను మూసివేశారు.

జూన్‌ 1 నుంచి 7 రైల్వేస్టేషన్లను మూసివేయగా.. ఆ జాబి­తాలో కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణగూడెం, బలభద్రపురం, తిమ్మా­పురం, చింతపర్రు స్టేషన్లు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement