Vijayawada Divisional Railway
-
తెగని టికెట్లు.. ద.మ. రైల్వే కీలక నిర్ణయం.. 23 రైల్వేస్టేషన్ల మూసివేత
ఏలూరు (టూటౌన్): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని 23 రైల్వేస్టేషన్లను మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 23 స్టేషన్లు మూతపడ్డాయి. ఇప్పటికే ఈ స్టేషన్ల పరిధిలోని సిబ్బందిని చాలా వరకు ఇతర రైల్వే స్టేషన్లకు సర్దుబాటు చేశారు. రవాణా సాధనాలు పెరగడం, రోడ్డు మార్గాలు అందుబాటులోకి రావడంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే స్టేషన్లు మినహా ప్యాసింజర్ రైళ్లు ఆగే వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికుల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. మూసివేతకు కారణాలివీ.. కనీసం రోజుకు 25 మంది ప్రయాణికులు కూడా రాకపోకలు సాగించని రైల్వే స్టేషన్లను మూసివేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రోజుకు ఒకటి, రెండు టికెట్లు మాత్రమే అమ్ముడవుతున్న చోట్ల బుకింగ్స్ నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారు. మూసివేసిన స్టేషన్లు ఇవే.. మే 1వ తేదీ విజయవాడ డివిజన్ పరిధిలోని ఎన్ఎస్జీ–6 కేటగిరీలో ఉన్న 16 స్టేషన్ల మూసివేతకు తొలుత డ్రా‹ఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యంతరాలేవీ రాకపోవడంతో అల్లూరు రోడ్డు, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద, నవాబ్‌పాలెం, పెన్నాడ అగ్రహారం, పెద అవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీ వెంకటేశ్వరపాలెం, తాలమంచి, తేలప్రోలు, వట్లూరు రైల్వే స్టేషన్లను మూసివేశారు. జూన్ 1 నుంచి 7 రైల్వేస్టేషన్లను మూసివేయగా.. ఆ జాబితాలో కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణగూడెం, బలభద్రపురం, తిమ్మాపురం, చింతపర్రు స్టేషన్లు ఉన్నాయి. -
ఉత్తుత్తి రైలు ప్రమాదం
సమయం : శుక్రవారం ఉదయం 11 గంటలు ప్రదేశం : విజయవాడలో వించిపేట రైల్వే అప్ యూర్డ్ రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి పెద్ద శబ్ధంతో ఢీకొన్నాయి. ఒక రైలు భోగీపైకి మరో రైలు భోగి పూర్తిగా ఎక్కిపోయింది. కింద భోగిలో ఉన్న ప్రయూణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆ సమీపంలో ఉన్న వారంతా ఒక్కసారిగా గుమ్మిగూడటంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రమాదం ఎలా జరిగిందో.. ఎంతమంది చనిపోయూరో.. అని ఒకటే చర్చలు. ఇంతలో విజయవాడ డివిజనల్ రైల్వే ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్, రైల్వే ఆస్పత్రి వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులే కాకుండా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కమాండర్లు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్దపెద్ద క్రేన్లు, ఆంబులెన్సులు, రైల్వే మెడికల్, యూక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్లు నిమిషాల్లో వచ్చేశాయి. పూర్తిగా గాయూలపాలై రక్తపు మడుగులో కొట్టుకుంటున్న ప్రయూణికులను ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు, రైల్వే సిబ్బంది బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. విషమ పరిస్థితిలో ఉన్న కొంతమందిని ఆస్పత్రికి తరలించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్, ఏడీఆర్ఎం ఎన్‌ఎస్‌ఆర్‌కే ప్రసాద్, సీనియర్ డివిజనల్ భద్రతాధికారి ప్రసాద్‌తోపాటు ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ కమాండర్ ప్రశాంత్‌దత్, డెప్యూటీ కమాండర్ సంతోష్‌కుమార్ నేతృత్వంలో దాదాపు 200 మంది సిబ్బంది ఈ రిస్క్ ఆపరేషన్‌లో పాల్గొని పడిపోయిన బోగీలను భారీ క్రేన్ సహాయంతో కిందకు దించారు. బెటాలియన్ కమాండర్ మైక్ ద్వారా సిబ్బందికి సూచనలిస్తూ ప్రయూణికులను రక్షించారు. ఈ తంతును కళ్లార్పకుండా చూస్తూ ‘హమ్మయ్యా..’ అనుకున్న జనం మైక్‌లోని మాటలు విని ఒక్కసారిగా ఫక్కున నవ్వుకున్నారు. ఇది నిజమైన ప్రమాదం కాదని, రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసే మాక్‌డ్రిల్ అని ఆ మైక్‌లో వచ్చిన మాటల సారాంశం. రైల్వేశాఖ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ అని తెలుసుకుని, వారి పనితీరును మెచ్చుకుని వెనుదిరిగారు. - విజయవాడ