ఉత్తుత్తి రైలు ప్రమాదం | Hollow train accident | Sakshi
Sakshi News home page

ఉత్తుత్తి రైలు ప్రమాదం

Published Sat, Jul 12 2014 2:13 AM | Last Updated on Sat, Aug 18 2018 2:15 PM

ఉత్తుత్తి రైలు ప్రమాదం - Sakshi

ఉత్తుత్తి రైలు ప్రమాదం

  • సమయం : శుక్రవారం ఉదయం 11 గంటలు
  •  ప్రదేశం : విజయవాడలో వించిపేట రైల్వే అప్ యూర్డ్
  • రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి పెద్ద శబ్ధంతో ఢీకొన్నాయి. ఒక రైలు భోగీపైకి మరో రైలు భోగి పూర్తిగా ఎక్కిపోయింది. కింద భోగిలో ఉన్న ప్రయూణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆ సమీపంలో ఉన్న వారంతా ఒక్కసారిగా గుమ్మిగూడటంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రమాదం ఎలా జరిగిందో.. ఎంతమంది చనిపోయూరో.. అని ఒకటే చర్చలు.

    ఇంతలో విజయవాడ డివిజనల్ రైల్వే ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్, రైల్వే ఆస్పత్రి వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులే కాకుండా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) కమాండర్లు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్దపెద్ద క్రేన్లు, ఆంబులెన్సులు, రైల్వే మెడికల్, యూక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్లు నిమిషాల్లో వచ్చేశాయి. పూర్తిగా గాయూలపాలై రక్తపు మడుగులో కొట్టుకుంటున్న ప్రయూణికులను ఎన్‌డీఆర్‌ఎఫ్ జవాన్లు, రైల్వే సిబ్బంది బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు.

    విషమ పరిస్థితిలో ఉన్న కొంతమందిని ఆస్పత్రికి తరలించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్, ఏడీఆర్‌ఎం ఎన్‌ఎస్‌ఆర్‌కే ప్రసాద్, సీనియర్ డివిజనల్ భద్రతాధికారి ప్రసాద్‌తోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ పదో బెటాలియన్ కమాండర్ ప్రశాంత్‌దత్, డెప్యూటీ కమాండర్ సంతోష్‌కుమార్ నేతృత్వంలో దాదాపు 200 మంది సిబ్బంది ఈ రిస్క్ ఆపరేషన్‌లో పాల్గొని పడిపోయిన బోగీలను భారీ క్రేన్ సహాయంతో కిందకు దించారు. బెటాలియన్ కమాండర్ మైక్ ద్వారా సిబ్బందికి సూచనలిస్తూ ప్రయూణికులను రక్షించారు.  

    ఈ తంతును కళ్లార్పకుండా చూస్తూ ‘హమ్మయ్యా..’ అనుకున్న జనం మైక్‌లోని మాటలు విని ఒక్కసారిగా ఫక్కున నవ్వుకున్నారు. ఇది నిజమైన ప్రమాదం కాదని, రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసే మాక్‌డ్రిల్ అని ఆ మైక్‌లో వచ్చిన మాటల సారాంశం. రైల్వేశాఖ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ అని తెలుసుకుని, వారి పనితీరును మెచ్చుకుని వెనుదిరిగారు.     
    - విజయవాడ
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement