![Jama Masjid To Close Again Over Rising COVID-19 Cases - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/11/jama%20masjids.jpg.webp?itok=nLSDeL4r)
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరిగిన క్రమంలో చారిత్రక జామా మసీదును గురువారం రాత్రి 8 గంటల నుంచి జూన్ 30 వరకూ మూసివేస్తున్నట్టు మసీదు షహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారి వెల్లడించారు. మసీదును తిరిగితెరిచిన మూడు రోజుల అనంతరం మూసివేత నిర్ణయం తీసుకున్నారు. సప్థర్‌జంగ్ ఆస్పత్రిలో తన కార్యదర్శి అమానుల్లా కరోనా మహమ్మారితో మరణించిన రెండు రోజుల తర్వాత షహీ ఇమాం మసీదు మూసివేత నిర్ణయం ప్రకటించారు. జూన్ 3న కరోనా వైరస్‌తో బాధపడుతూ అమానుల్లా ఆస్పత్రిలో చేరారు.
దేశంలో కోవిడ్-19 కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా కొంతకాలం పాటు మసీదులను మూసివేయాలని బుఖారీ విజ్ఞప్తి చేశారు. మసీదులకు వెళ్లకుండా ప్రజలు ఇంటి వద్దే నమాజ్ చేసుకునేలా ఇతర మసీదులు నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుదీర్ఘ లాక్‌డౌన్ అనంతరం ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రెండు నెలల తర్వాత సోమవారం జామా మసీదు గేట్లు తెరుచుకున్నాయి. చదవండి : అమిత్ షాతో కేజ్రీవాల్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment