భక్తులకు అలర్ట్‌.. ఈ నెల 25న దుర్గగుడి మూసివేత  | Closure of Vijayawada Durga Temple on October 25 | Sakshi
Sakshi News home page

Vijayawada: భక్తులకు అలర్ట్‌.. ఈ నెల 25న దుర్గగుడి మూసివేత 

Published Sat, Oct 8 2022 9:05 AM | Last Updated on Sat, Oct 8 2022 2:22 PM

Closure of Vijayawada Durga Temple on October 25 - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఈ నెల 25వ తేదీన సూర్య గ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంతోపాటు అన్ని ఉపాలయాలను మూసివేస్తామని ఆలయ వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పూజా కార్యక్రమాల అనంతరం దుర్గమ్మ దర్శనం నిలిపివేయడంతోపాటు ఆలయ ద్వారాలను మూసివేస్తామని వివరించారు.
చదవండి: అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్‌.. ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు

తిరిగి 26 ఉదయం ఆరు గంటలకు దుర్గగుడి తెరుస్తామని, అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం మహా నివేదన సమర్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.10 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. ఈ నెల 26వ తేదీన తెల్లవారుజాముతోపాటు ఉదయం జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement