consulates
-
ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. బెంగుళూరుకు శుభవార్త!
వాషింగ్టన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో పాల్గొన్న ప్రధాని.. ఆ కార్యక్రమాన్ని ముగించుకుని అక్కడి నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్కు చేరుకున్నారు. వైట్‌హౌస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్లు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా.. ప్రధాని అమెరికా పర్యటనలో ఉండగా భారత్ పై పలు వరాలను కురిపించింది అగ్రరాజ్యం. భారత్‌లో కొత్త కాన్సులేట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. అందుకోసం తొలిదశలో రెండు నగరాలను ఎంపిక చేసింది. ఒకటి బెంగళూరు కాగా మరొకటి అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో నాలుగు నగరాల్లో మాత్రమే యూఎస్ కాన్సులేట్స్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ముంబై, కోల్‌కత, హైదరాబాద్, చెన్నైల్లో యూఎస్ కాన్సులేట్స్ కార్యాలయాలు అందుబాటులో ఉంటోన్నాయి. #WATCH वाशिंगटन डी. सी. (USA): भारत के प्रधानमंत्री नरेंद्र मोदी व्हाइट हाउस पहुंचे। अमेरिकी राष्ट्रपति जो बाइडेन और प्रथम महिला जिल बाइडेन ने उनका स्वागत किया। pic.twitter.com/TGuavw2zRn — ANI_HindiNews (@AHindinews) June 22, 2023 చదవండి: ఆక్సిజన్ అయిపోయింది.. అయిదుగురి ప్రాణాలపై సన్నగిల్లుతున్న ఆశలు -
21,308 మందికి దౌత్య సేవలు
గల్ఫ్ డెస్క్: దుబాయిలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆగస్టులో 21,308 మందికి దౌత్య సేవలు అందించినట్లు విదేశాంగ శాఖ అధికారులు ఇటీవల వెల్లడించారు. వివిధ రకాల దౌత్య సేవలతో ప్రవాస భారతీయుల సమస్యలు పరిష్కారమయ్యాయి. -
ఇండియన్ ఎంబసీ వద్ద అనుమానిత వస్తువుల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని భారత ఎంబసీ వద్ద బుధవారం ఉదయం అనుమానిత వస్తువులు కనబడడంతో కలకలం రేగింది. వాటిని పేలుడు పదార్థాలుగా భావిస్తున్నారు. బాంబు నిర్వీర్య దళం, ఫైర్ ఇంజన్లు, ఎమర్జెన్సీ వాహనాలు ఎంబసీ వద్దకు చేరుకున్నాయి. సిబ్బందిని కార్యాలయం నుంచి ఖాళీ చేయించారు. ఇండియాతో పాటు పాకిస్తాన్, న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, గ్రీస్, స్పెయిన్, సెచెల్లెస్, స్విట్జర్లాండ్, క్రోయేషియా, ఈజిప్టు, యూకే, యూఎస్ఏ ఎంబసీల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఓ స్థానిక చానెల్ పేర్కొంది. అక్కడ కూడా అనుమానిత ప్యాకేజీలు బయటపడడంతో భయాందోళనలు మొదయ్యాయని వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపింది. -
తెరుచుకోనున్న యూఎస్ దౌత్య కార్యాలయాలు
మధ్య ప్రాచ్య దేశాల్లో తత్కాలికంగా మూసివేసిన రాయబార కార్యాలయాలు ఆదివారం నుంచి తిరిగి తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. ఈ మేరకు నిన్న ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి జెన్ సాకి శనివారం వెల్లడించారు. కాగా యెమెన్ రాజధాని సనాలోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని మాత్రం తెరవడం లేదని తెలిపింది. అలాగే పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ నగరాల్లోని రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేయాలని ఒబామా ప్రభుత్వం ఆదేశించిన సంగతిని ఈ సందర్భంగా ఆ అధికారి గుర్తు చేశారు. అలాగే కార్యాలయ సిబ్బంది స్వదేశానికి సాధ్యమైనంత త్వరగా తరలిరావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని యూఎస్ దౌత్య కార్యాలయాలపై తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా దాడుల చేయనున్నట్లు అమెరికా నిఘా సంస్థకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఒబామా ప్రభుత్వం వివిధ దేశాల్లోని దాదాపు 25పైగా యూఎస్ దౌత్య కార్యాలయాను ఈ వారం మొదట్లో మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే యెమెన్ దేశంలో ఆల్ ఖైదాకు చెందిన విభాగం అత్యంత వేగంగా దాడులు చేసే సూచనలు ఉన్నాయని యూఎస్ నిఘా వర్గాలకు సమాచారం చేరింది. దీంతో ఆ దేశ రాజధాని సనాలోని రాయబార కార్యాలయాన్ని ఇప్పుడు అప్పుడే తెరిచే ఆలోచనను యూఎస్ పక్కన పెట్టింది.