వాషింగ్టన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో పాల్గొన్న ప్రధాని.. ఆ కార్యక్రమాన్ని ముగించుకుని అక్కడి నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు చేరుకున్నారు. వైట్‌హౌస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్‌లు స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా.. ప్రధాని అమెరికా పర్యటనలో ఉండగా భారత్ పై పలు వరాలను కురిపించింది అగ్రరాజ్యం. భారత్‌లో కొత్త కాన్సులేట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. అందుకోసం తొలిదశలో రెండు నగరాలను ఎంపిక చేసింది. ఒకటి బెంగళూరు కాగా మరొకటి అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో నాలుగు నగరాల్లో మాత్రమే యూఎస్ కాన్సులేట్స్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ముంబై, కోల్‌కత, హైదరాబాద్, చెన్నైల్లో యూఎస్ కాన్సులేట్స్ కార్యాలయాలు అందుబాటులో ఉంటోన్నాయి.
#WATCH वाशिंगटन डी. सी. (USA): भारत के प्रधानमंत्री नरेंद्र मोदी व्हाइट हाउस पहुंचे। अमेरिकी राष्ट्रपति जो बाइडेन और प्रथम महिला जिल बाइडेन ने उनका स्वागत किया। pic.twitter.com/TGuavw2zRn
— ANI_HindiNews (@AHindinews) June 22, 2023
చదవండి: ఆక్సిజన్ అయిపోయింది.. అయిదుగురి ప్రాణాలపై సన్నగిల్లుతున్న ఆశలు
Comments
Please login to add a commentAdd a comment