aceh
-
ఒక సునామీ.. 600 ఏళ్ల చరిత్రను మార్చింది
ఇండోనేసియాకు ఆగ్నేయంగా ఉన్న సుమత్రా దీవుల్లో 2004, డిసెంబర్ 26న సంభవించిన భూకంపం ధాటికి ఆచె తీర ప్రాంతంలో రాకాసి అలలు 100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడి అందరినీ భయకంపితుల్ని చేశాయి. కేవలం ఆచెలో లక్షా 60 వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. సరిగ్గా 600 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో వచ్చిన సునామీ ఇండోనేసియా చరిత్ర గతిని మార్చేసింది. ఒక శక్తిమంతమైన ముస్లిం రాజ్య స్థాపనకు కారణమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇటీవల ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 2004 నాటి సునామీ ప్రభావాన్ని అంచనా వేసే క్రమంలో పురావస్తు శాస్త్రవేత్త పాత్రిక్ డ్యాలీకి ముస్లింలకు చెందిన కొన్ని సమాధులు కనిపించాయి. అవి 600 ఏళ్ల నాటికి క్రితంవని తేలింది. ఆ సమయంలో వచ్చిన సునామీ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తే, అక్కడే ఆచె అనే బలమైన సుల్తాన్ రాజ్యం ఏర్పడిందని తేలింది. ఆచె అనే ఈ రాజ్యం శతాబ్దాల పాటు వలసవాదులు ఆక్రమించకుండా విజయవంతంగా అడ్డుకుంది. సింగపూర్ ఎర్త్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్న డ్యాలీ అకెహ్ తీర ప్రాంతంలో 40కి పైగా గ్రామాల్లో పాత మసీదుల సమాధుల్ని, పాలరాతి కట్టడాలను, మానవ అవశేషాల్ని కనుగొన్నారు. అవన్నీ 11, 12 శతాబ్దాలకు చెందినవని తేలింది. 1394లో అక్కడ సునామీ వచ్చి ఊళ్లకి ఊళ్లను ముంచేసిందని వారికి తెలిసింది. సునామీ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు. ఆ తర్వాత కాలంలో అక్కడికి వచ్చిన వారు అత్యంత శక్తిమంతమైన ఇస్లాం రాజ్యం ఆచెను ఏర్పాటు చేశారని వారు చేసిన అధ్యయనంలో తేలింది. -
యువకుడితో సన్నిహితంగా ఉందని..
జకార్త: ఇండోనేషియాలో ఓ మహిళ బెత్తం దెబ్బలు తింటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బండా ఎసె ప్రాంతానికి చెందిన మహిళకు అక్కడి ఇస్లామిక్ చట్టాల ప్రకారం అధికారులు బెత్తం దెబ్బలను శిక్షగా విధించారు. ఈ శిక్ష అమలు సదర్భంగా సదరు మహిళ మొహాన్ని చేతులతో కప్పుకొని ఏడుస్తున్న తీరు పట్ల నెటీజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే.. పెళ్లి కాకుండానే ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం. దీంతో.. ప్రియుడితో పాటు ఆమెకు పబ్లిగ్గా 26 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. ఇండోనేషియాలో షరియా చట్టం అమలవుతున్న ఒకే ఒక ప్రావిన్స్ ఎసె. దీని ప్రకారం వివాహానికి ముందు యువతీ యువకులు సన్నిహితంగా ఉండటం నిషేధం. -
భారీ వరదలు : 35 వేలమంది తరలింపు
జకార్తా: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇండోనేసియాలోని పశ్చిమ జావా, ఏచ్ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో దాదాపు 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆ దేశ జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు. వేలాది ఇళ్లు వరద నీటిలో చిక్కుకుపోయాయని తెలిపారు. నిరాశ్రయులకు ఆహారం పదార్థాలు, తాగు నీరు అందజేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు, సైనికులతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 12న జావాలో మట్టి పెళ్ల విరిగిపడి 95 మంది మరణించారు. మరో 13 మంది జాడ తెలియరాలేదు. ఇండోనేసియాలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. దాంతో వరద పోటెత్తుతుంది అలాగే కొండ ప్రాంతంలో నివసించే జనావాసాలపై భారీగా కొండ చరియలు విరిగిపడుతున్న సంగతి తెలిసిందే.