
ఆహుతి ప్రసాద్ మృతికి ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు, క్యారెక్టర్ అర్టిస్ట్ ఆహుతి ప్రసాద్ ఆదివారం కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది.
*ఆహుతి ప్రసాద్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నటుడు గిరిబాబు అన్నారు. సినిమా షూటింగ్ సమయంలో బాబాయి బాబాయి అంటూ ఉండే వాడని ఆయన తెలిపారు.
*ప్రసాద్ మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తెలపారు. ఇద్దరం కలసి చాలా సినిమాల్లో నటించామన్నారు. చాల ప్రెండ్లీగా ఉండేవాడని భరణి ఈ సందర్బంగా ప్రసాద్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ మధ్య 20 ఏళ్లగా పరిచయం ఉందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏదో శని పట్టినట్లుందని తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు మృతి చెందిన సంగతి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
*ప్రసాద్ మృతి వార్తా చాలా షాక్కు గురి చేసిందని ప్రముఖ నటుడు, మాటల రచయిత ఉత్తేజ్ తెలిపారు. తమ ఇద్దరి కాంబినేషన్లో చాలా చిత్రాలు వచ్చాయని చెప్పారు. ఇద్దరం కలసి నంది అవార్డులు అందుకున్నామని గుర్తు చేసుకున్నారు. అందరితో స్నేహ పూర్వకంగా మెలిగేవారని ఉత్తేజ్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలోని వాళ్లకు ఇలా జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో ప్రసాద్ మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. దాదాపు 15 సినిమాల్లో ఇద్దరం కలసి నటించామని చెప్పారు. తన మనస్సుకు దగ్గరగా ఉన్న వారిలో ప్రసాద్ ఒకరని.... ఆయన ఇలా వదిలి వెళ్లిపోవడం బాధకరమని ఉత్తేజ్ తెలిపారు. ఆహుతి ప్రసాద్ ఆకస్మిక మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు.