
గోప్యత పాటిస్తున్న నటుడి కుటుంబసభ్యులు!
'ఆహుతి' చిత్రాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు పెదవి విప్పటం లేదు. కాగా ఆహుతి ప్రసాద్.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇంతకీ అనారోగ్యం ఏమిటనేది ...ఆహుతి ప్రసాద్ కుటుంబ సభ్యులు గోప్యత పాటిస్తున్నట్లు ఆయనతో సన్నిహితంగా ఉండే ఒకరు తెలిపారు. '
ఆహుతి ప్రసాద్కు ఫోన్ చేసినా... నాన్న బిజీగా ఉన్నారని ఆయన కుమారుడు సమాధానం ఇస్తున్నారని, అయితే అసలు విషయం తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లితే...ఆహుతి ప్రసాద్ బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని' ఆయన పేర్కొన్నారు. కాగా ఆహుతి ప్రసాద్ కేన్సర్తో బాధపడుతున్నారని, ఆయన రెండు నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్దన వరప్రసాద్. ఆయన సొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు. 1986లో 'విక్రమ్' సినిమా ద్వారా ఆహుతి ప్రసాద్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అనంతరం ఆయన నటించిన 'ఆహుతి' పెద్ద బ్రేక్ ఇచ్చింది. గులాబి, నిన్నే పెళ్లాడతా, చంద్రమామ, కొత్త బంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాల్లో ఆహుతి ప్రసాద్ చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'చందమామ' సినిమాకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు.