
'కర్ణాటక నుంచి వచ్చి తనదైన ముద్రవేశారు'
హైదరాబాద్: సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న అతి తక్కువ మంది నటుల్లో ఆహుతి ప్రసాద్ ఒకరని నటుడు శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం కన్నుమూసిన ఆహుతి ప్రసాద్ కు నివాళులు అర్పించిన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసి చాలా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆహుతి ఇక లేకపోడం చాలా బాధాకరమన్నారు. కర్ణాటక ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసిన ఆయన తూర్పు గోదావరి జిల్లా శైలిని బాగా అనుకరించడం సాధారణ విషయం కాదని శ్రీకాంత్ తెలిపారు.
ప్రస్తుతం ఆయన బిజీ షెడ్యూల్ తో ఉన్నారని.. ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీని వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.