సునందకు వైద్య పరీక్షలు నిర్వహించాం: కిమ్స్ | Sunanda underwent medical check up at KIMS earlier this week | Sakshi
Sakshi News home page

సునందకు వైద్య పరీక్షలు నిర్వహించాం: కిమ్స్

Published Sat, Jan 18 2014 12:33 PM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

సునందకు వైద్య పరీక్షలు నిర్వహించాం: కిమ్స్ - Sakshi

సునందకు వైద్య పరీక్షలు నిర్వహించాం: కిమ్స్

కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ ఈ వారం మొదట్లో కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆ ఆసుపత్రి ప్రతినిధి శనివారం ఇక్కడ వెల్లడించారు. అందుకోసం సునంద ఈ నెల 13న ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. ఆ రోజు ఆ మరుసటి రోజున ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అయితే వైద్య పరీక్షలు నివేదిక అందేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే మందులు ఇస్తామని సునందతో వెల్లడించినట్లు పేర్కొన్నారు.

 

నేడు, రేపో ఆమె ఆసుపత్రి వచ్చి వైద్య పరీక్షల నివేదిక తీసుకుంటుందని తాము భావించామన్నారు. అయితే ఆ నివేదికలో ఏం ఉంది అనే అంశాన్ని మాత్రం వెల్లడించేందుకు ఆసుపత్రి ప్రతినిధి నిరాకరించారు. కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద నిన్న రాత్రి న్యూఢిల్లీని హోటల్లో విగత జీవిగా మారిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement