సునందకు వైద్య పరీక్షలు నిర్వహించాం: కిమ్స్
కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ ఈ వారం మొదట్లో కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆ ఆసుపత్రి ప్రతినిధి శనివారం ఇక్కడ వెల్లడించారు. అందుకోసం సునంద ఈ నెల 13న ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. ఆ రోజు ఆ మరుసటి రోజున ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అయితే వైద్య పరీక్షలు నివేదిక అందేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే మందులు ఇస్తామని సునందతో వెల్లడించినట్లు పేర్కొన్నారు.
నేడు, రేపో ఆమె ఆసుపత్రి వచ్చి వైద్య పరీక్షల నివేదిక తీసుకుంటుందని తాము భావించామన్నారు. అయితే ఆ నివేదికలో ఏం ఉంది అనే అంశాన్ని మాత్రం వెల్లడించేందుకు ఆసుపత్రి ప్రతినిధి నిరాకరించారు. కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద నిన్న రాత్రి న్యూఢిల్లీని హోటల్లో విగత జీవిగా మారిన సంగతి తెలిసిందే.