
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. నెల రోజుల క్రితం అనారోగ్యంతో కిమ్స్‌లో చేరారు. శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించినట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించిన కాకర్ల సుబ్బారావు.. 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు చల్లపల్లి, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి ఆయన డాక్టర్ పట్టా పొందారు.
చదవండి:
తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
Comments
Please login to add a commentAdd a comment