అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులతో చర్చించారు.
( ఇది చదవండి: శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది: సీపీ సీవీ ఆనంద్)
సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని.. రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించిందని అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని వివరించారు. అందుకే అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..
ఈనెల 5న అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే ఒక రోజు ముందే ఈ మూవీ ప్రీమియర్స్ షోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బన్నీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో సినిమా వీక్షించారు. అదే సమయంలో ఫ్యాన్స్ దూసుకురావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment