
ఆస్పత్రి నుంచి దాసరి నారాయణరావు డిశ్చార్జ్
హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మంగళవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన గత రెండు నెలలుగా కిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ జనవరి 29న దాసరి కిమ్స్‌లో చేరారు.
ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్ క్లీన్ చేస్తున్న సమయంలో దాసరికి గుండెపోటు రావడం, కిడ్నీల పనితీరు మందగించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రి సీఈవో భాస్కర్ రావు నేతృత్వంలో దాసరికి చికిత్స చేశారు. అనంతరం ఆయనను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. ప్రస్తుతం దాసరి పూర్తిగా కోలుకోవడంతో ఆయనను డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ భాస్కర్‌రావు ప్రకటించారు.