రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): దేశంలో ఏటా సుమారు 2.33 లక్షల మంది పురుషులు ప్రొస్టేట్ కేన్సర్ బారిన పడుతున్నారని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రొస్టేట్ కేన్సర్ అవగాహన మాసం సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూరాలజీ వైద్యులు డాక్టర్ ఉపేంద్రకుమార్, డాక్టర్ గోపీచంద్, డాక్టర్ ఎన్.త్రివేది మాట్లాడారు. కేవలం పురుషుల్లోనే కనిపించే ఈ కేన్సర్ మూత్రాశయం కింద ఉండే ప్రొస్టేట్ గ్రంథిలో మొదలై శరీరమంతా వ్యాపిస్తుందన్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కువ మంది పురుషుల మరణానికి కారణమవుతున్న రెండో కేన్సర్ ఇదేనని చెప్పారు.
వ్యాధి సోకిన వ్యక్తులకు పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండా నాలుగో స్టేజీ వరకు వెళుతుందన్నారు. 50 ఏళ్లు దాటిన పురుషులకు ముందస్తుగా పీఎస్‌ఏ, ట్రస్ బయాప్సీ, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ లాంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో ఈ కేన్సర్‌ను గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం సులభమని చెప్పారు. కిమ్స్ ఆస్పత్రిలో ఈ నెల మొత్తం ప్రొస్టేట్ కేన్సర్ పరీక్షలు, కన్సల్టేషన్‌కు రాయితీలు అందిస్తున్నామని వివరించారు.
ఏటా 2.33 లక్షల మందికి ప్రొస్టేట్ కేన్సర్
Published Mon, Sep 7 2015 8:26 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM
Advertisement