గెయిల్ క్షతగాత్రుల వివరాలు ఇవే | GAIL pipeline blast Victim Details | Sakshi
Sakshi News home page

గెయిల్ క్షతగాత్రుల వివరాలు ఇవే

Published Fri, Jun 27 2014 12:32 PM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

GAIL pipeline blast Victim Details

అమలాపురం : గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనలో గాయపడిన 12మంది క్షతగాత్రులు అమలాపురం  కోనసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో  పలువురు 90శాతం గాయపడినవారే. మెరుగైన చికిత్స కోసం వారిలో కొందరిని కిమ్స్ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా గాయపడినవారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు అయిదుగురు ఉన్నారు. గాయపడినవారి వివరాలు. 1.ఎం.డి.తఫీ,2.తాటికాయల రాజ్యలక్ష్మి, 3.ఓనరాసి దుర్గాదేవి, 4.ఓనరాసి వెంకటరత్నం,5.రాయుడు సూర్యనారాయణ, 6.బోనం పెద్దిరాజు, 7.బోనం రత్నకుమారి,8.పల్లాలమ్మ, 9.ఓనరాసి మధుసూదన్ (9), 10.మోహన్ కృష్ణ (7), 11.జోత్స్నాదేవి (8), 12.కావీ చిన్నా (18నెలలు). కాగా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మద్దాల బాలాజీ, గోపిరెడ్డి దివ్యతేజ మృతి చెందారు. దుర్ఘటనలో 18మంది సజీవ దహనం కాగా, 30మంది గాయపడిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement