gail pipeline burst
-
నగరం ఘటనపై కేసు నమోదు
-
ఇక్కడి ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం ?
-
నగరం ప్రమాదమెలా జరిగింది ?
-
మృత్యు ఘడియలు
-
నగరం విషాదం జరిగిన తీరిదీ..
-
నగరం ప్రమాదంలో తప్పెవరిది?
-
పేదోళ్లమైనందుకేనా.. ఈ నిర్లక్ష్యం!
-
సీఎం గారు వచ్చారు.. వెళ్లారు!
-
'ఈ ఘటన దురదృష్టకరం'
-
'బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'
-
గెయిల్ బాధితులకు బాలకృష్ణ సంతాపం
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా గెయిల్ పైపులైన్ పేలుడు దుర్ఘటనపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలక ప్రగాఢ సానుభూతి తెలిపారు. మామిడికుదురు మండలం నగరం వద్ద శుక్రవారం గ్యాస్ పైపులైన్ పేలడంతో 15 మంది మరణించారు. మరో 25 మంది గాయపడగా, వీరిలో తొమ్మిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయిల చొప్పున ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. -
నిర్లక్ష్యమే కారణమైతే.. చర్యలు తప్పవు
-
నిండు జీవితాల్ని ఛిద్రం చేసిన విషాదం
-
నిర్వహణ లోపం వల్లే 'గెయిల్' పేలుడు
-
నిర్వహణ లోపం వల్లే 'గెయిల్' పేలుడు
తూర్పు గోదావరి జిల్లా శుక్రవారం జరిగిన గెయిల్ పైపులైన్ పేలుడుకు గల కారణాలను ఆంధ్ర విశ్వివిద్యాలయం ప్రొఫెసర్ సీవీ రామన్ విశ్లేషించారు. పైపులైన్ల నిర్వహణ, ప్రమదాలు జరగడానికి గల కారణాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. డెల్టాలో చమురు తవ్వకాల వల్ల జరిగిన ప్రమాదం కాదు. ఇది కేవలం నిర్వహణలోపం వల్లే జరిగింది. పైపులైనును ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఈ తరహా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదసంకేతాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల, సమన్వయ లోపం వల్ల ఇలా జరిగింది. గెయిల్ అధికారుల దగ్గర్నుంచి స్థానిక పంచాయతీ సర్పంచి వరకు అందరి మధ్య సమన్వయం ఉండాలి. పైపులైన్ మీద ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటాయి. అందువల్ల ప్రతి మూడు నెలలకు ఒకసారి వీటిని సాంకేతిక నిపుణులు పరిశీలించాలి. ఐదు, పదేళ్లకోసారి మాత్రమే చూస్తే లోపాలు కూడా సరిగ్గా తెలియవు. పాతికేళ్ల నాటి పైపులు అంటే.. వాటి జాయింట్ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. -
క్షతగాత్రుల్లో 15మంది పరిస్థితి విషమం
-
'పైప్‌లైన్‌పై చేయి వేస్తే ఆరేళ్లు జైలన్నారు'
గ్యాస్ పైప్లైన్లు తుప్పు పట్టాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. గెయిల్ పేలుడు ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు గెయిల్ సంస్థ బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా పాడైపోయిన పైప్లైన్ల స్థానంలో కొత్త పైప్లైన్లు వేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. పైప్లైన్ల లీకేజి విషయంలో తాను కేంద్రానికి మూడుసార్లు లేఖ రాసినా, అధికార పక్షంలో ఉన్న ఎంపీ అయినా కూడా తన లేఖను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అంతే కాకుండా 1960 నాటి పైపులైను చట్టం ప్రకారం పైప్లైన్లపై చేయి వేస్తే ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారని, ఆ నిబంధన మార్పుతో పాటు, గ్యాస్ లీక్ వల్ల ప్రమాదాలు జరిగితే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలనే అంశాన్ని చేర్చాలని ప్రతిపాదించినా ఫలితం లేకపోయిందన్నారు. యూపీఏ ప్రభుత్వంలోని చమురు మంత్రిత్వశాఖ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పైప్‌లైన్ లీక్ వల్ల ఎకరం మేరకు గ్యాస్ వ్యాపించిందని, అగ్గిపుల్ల వెలిగించటంతో పేలుడు జరిగిందని హర్షకుమార్ అన్నారు. అదే ఏ పదో లేక ఇరవయ్యో ఎకరాల మేరకు గ్యాస్ వ్యాపించి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదన్నారు. ఓఎన్జీసీ, గెయిల్ నిర్లకక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా ఆ సంస్థలు ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాలన్నారు. లేకుంటే కోనసీమ ప్రజలు గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను పూర్తిగా బహిష్కరించే అవకాశం ఉందని హర్షకుమార్ అన్నారు. ప్రభుత్వాలు స్పందించి ప్రజలకు భద్రతతో పాటు భరోసా కల్పించాలని ఆయన కోరారు. -
పేలుడుపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
-
గెయిల్ క్షతగాత్రుల వివరాలు ఇవే
అమలాపురం : గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనలో గాయపడిన 12మంది క్షతగాత్రులు అమలాపురం కోనసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో పలువురు 90శాతం గాయపడినవారే. మెరుగైన చికిత్స కోసం వారిలో కొందరిని కిమ్స్ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడినవారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు అయిదుగురు ఉన్నారు. గాయపడినవారి వివరాలు. 1.ఎం.డి.తఫీ,2.తాటికాయల రాజ్యలక్ష్మి, 3.ఓనరాసి దుర్గాదేవి, 4.ఓనరాసి వెంకటరత్నం,5.రాయుడు సూర్యనారాయణ, 6.బోనం పెద్దిరాజు, 7.బోనం రత్నకుమారి,8.పల్లాలమ్మ, 9.ఓనరాసి మధుసూదన్ (9), 10.మోహన్ కృష్ణ (7), 11.జోత్స్నాదేవి (8), 12.కావీ చిన్నా (18నెలలు). కాగా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మద్దాల బాలాజీ, గోపిరెడ్డి దివ్యతేజ మృతి చెందారు. దుర్ఘటనలో 18మంది సజీవ దహనం కాగా, 30మంది గాయపడిన విషయం తెలిసిందే. -
పేలుడు ఘటన దురదృష్టకరం: చంద్రబాబు
న్యూఢిల్లీ : గెయిల్ పైప్‌లైన్ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పేలుడు ఘటనలో 14మంది చనిపోవటం బాధాకరమన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని ఘటనాస్థలానికి వెళుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామన్నారు. తనతో పాటు పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఘటనా స్థలానికి వస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. -
'అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదు'
-
ఒక్కసారిగా ఆందోళన చెందా: ప్రణబ్ ముఖర్జీ
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సంఘటన విషయం తెలియగానే ఆయన శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు వల్ల పది అడుగుల గొయ్యి పడిందని తెలిసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బాధిత కుటుంబాల వెంట ఉండాలని ఆయన తెలిపారు. ఇంత పెద్దప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే తాను ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యానని, క్షతగాత్రులకు వైద్యసేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటుందని ఆశిస్తున్నానని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. -
'అధికారులకు, 108కు ఫోన్ చేసినా పట్టించుకోలేదు'
అమలాపురం : గెయిల్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ పైప్‌లైన్ బలహీనపడిందని, అందుకే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. చాలాసార్లు లీకులు వస్తున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వారు ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పైప్‌లైన్‌ను రెండు నెలలుగా మరమ్మతు చేస్తున్నారని, అయితే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయలేదని స్థానికులు తెలిపారు. లీకు రాకుండా అధికారులు శ్రద్ధ పెట్టలేదన్నారు. ఉదయం 5.30 గంటలకు ప్రమాదం జరిగిందని, పేలుడు జరగగానే భయంతో పరుగులు తీశారన్నారు. అయిదు కిలోమీటర్ల వరకూ పేలుడు శబ్ధం వినిపించిందన్నారు. పేలుడు సంభవించిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి, అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసు డీఎస్పీ అధికారి మాత్రమే స్పందించారని స్థానికులు వెల్లడించారు. ఆయన మాత్రమే ఘటనాస్థలానికి చేరుకున్నారన్నారు. తమ కళ్ల ఎదుటే చాలామంది మృత్యువుతో పోరాడారని, అయితే తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామన్నారు. గ్రామం మధ్యలో ఉన్న పైప్‌లైన్‌ను తక్షణమే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేకుంటే తాము ఊరు విడిచి పోవాల్సిన ఉంటుందన్నారు. పైప్‌లైనును మార్చకపోవటమే ప్రమాదానికి కారణమన్నారు. రిఫైనరీకి కూతవేటు దూరంలో ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. బయట అధికారులు వచ్చేంతవరకూ కూడా గెయిల్ అధికారులు పట్టించుకోలేదన్నారు. హోటల్లో టీ పెట్టడానికి స్టౌ వెలిగించాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయన్నారు. ప్రమాదం తర్వాత ఏర్పడ్డ కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. ప్రజలకు భరోసా ఇచ్చేంతవరకూ పనులు నిలిపి వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: యనమల
న్యూఢిల్లీ : పైప్‌లైన్ పేలుడు ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. గ్యాస్ చాలా రోజుల నుంచి లీక్ అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారని యనమల పేర్కొన్నారు. గ్యాస్ పైప్‌లైన్ తుప్పుపట్టి పాడైందని చెబుతున్నా.... అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు... నగరంలోని జీసీఎస్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని వాహనాన్ని ధ్వంసం చేశారు. -
బ్లో అవుట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
ఢిల్లీ పర్యటను రద్దు చేసుకున్న చంద్రబాబు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేశారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైప్‌లైన్ పేలుడు ఘటన నేపథ్యంలో ఆయన తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో కలిసి ఆయన సంఘటనా స్థలానికి వెళ్లనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న అమలాపురం ఎంపీ రవీంద్రబాబు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఢిల్లీ నుంచి సాయంత్రానికి అమలాపురం చేరుకుంటామని రవీంద్రబాబు తెలిపారు. My condolences to the families who lost their loved ones in East Godavari blast. Ordered an enquiry & action plan to avoid these in future. — N Chandrababu Naidu (@ncbn) June 27, 2014 -
క్షతగాత్రుల్లో 15మంది పరిస్థితి విషమం
కాకినాడ : గెయిల్ పేలుడు ఘటనలో మొత్తం 15మంది మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి పద్మావతి అధికారికంగా ప్రకటించారు. మరో 32మంది గాయపడ్డారని, వారిలో 15మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. క్షతగాత్రులకు అమలాపురం ఏరియా ఆస్పత్రి సహా స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పద్మావతి చెప్పారు. కాగా అధికారికంగా 15మంది మృతి చెందినట్లు చెబుతున్నా... 18మంది చనిపోయినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ మృతి చెందినవారిలో గోపిరెడ్డి దివ్యతేజ, మద్దాల బాలాజీగా గుర్తించారు. -
గుర్తు పట్టలేని స్ధితిలో మృతదేహాలు
-
తీవ్ర భయాందోళనలో నగర ప్రజలు
-
సంఘటనా ప్రాంతంవద్ద భయానక పరిస్ధితి
-
పేలుడుపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మోడీ ఆదేశించారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేబినెట్ కార్యదర్శి తదితరులతో కూడా మోడీ చర్చించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్ లైన్ పేలిన విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ పేలుడులో 18మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. My thoughts with the families of those who lost their lives in the GAIL Pipeline fire in AP. Prayers with the injured. — Narendra Modi (@narendramodi) June 27, 2014 గెయిల్ పేలుడు ఘటనపై ఇంకా కారణాలు తెలియరాలేదని గెయిల్ ఛైర్మన్ బీసీ త్రిపాఠి తెలిపారు. 18 అంగుళాల పైప్‌లైన్ వద్ద పేలుడు జరిగిందని ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. సంఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టినట్లు త్రిపాఠి పేర్కొన్నారు. I have spoken to the Petroleum Minister, Cabinet Secretary & GAIL Chairman and asked them to ensure immediate relief at the accident site. — Narendra Modi (@narendramodi) June 27, 2014 -
ముందే లీకైన గ్యాస్!!
కోనసీమలోని నగరం వద్ద గెయిల్ గ్యాస్ పైప్‌లైను పగిలిపోవడం వల్ల గ్యాస్ ముందుగానే లీకైంది. గురువారం అర్ధ రాత్రి సమయంలో పైప్‌లైన్ పగలడంతో గ్యాస్ దాదాపు అరకిలోమీటరు మేర వ్యాపించింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అక్కడున్న ఓ హోటల్లో టీ పెట్టడానికి స్టౌ వెలిగించాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దాంతో అక్కడున్న ఇద్దరు అక్కడికక్కడే కాలిపోయారు. ఆ పక్క నుంచి బైకులో వెళ్తున్న తండ్రి, కూతురు కూడా సజీవ దహనమయ్యారు. ఇళ్లలో ఉన్నవాళ్లు పడుకున్నవాళ్లు పడుకున్నట్లే కాలిపోయారు. ఆ ప్రాంతంలో దాదాపు 10 అడుగుల మేర పెద్ద గొయ్యి ఏర్పడింది. అరకిలోమీటరు పరిధిలో అంతా బూడిద అయిపోయింది. మృతదేహాలు కనీసం గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా కాలిపోయాయి. అయితే.. ఇంత పెద్ద సంఘటన జరిగినా, ఓఎన్జీసీ, గెయిల్ అధికారులు మాత్రం వెంటనే స్పందించలేదు. ఈ ప్రాంతంలో ఉండే ఉన్నతాధికారులు తమ సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారంటూ స్థానికిఉలు జీసీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఓఎన్జీసీకి సంబంధించిన ఫైరింజన్లు వెనువెంటనే వచ్చి ఉంటే ప్రమాద తీవ్రత చాలావరకు తగ్గేదని స్థానికులు అంటున్నారు. -
మండిపడ్డ బాధితులు.. మంత్రి, కలెక్టర్ ఘెరావ్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్లను ఘెరావ్ చేశారు. పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. పైపులైన్లు మాత్రం మార్చకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే తాజా ప్రమాదం జరిగిందని అన్నారు. ఇక్కడ కొన్ని పైపులైన్లు గ్రామాల మధ్య నుంచి, మరికొన్ని పంటపొలాల మధ్య నుంచి ఉన్నాయి. దశాబ్దాల నాటి పైపులైన్లు కావడంతో పాటు, వాటి నిర్వహణను కూడా పట్టించుకోకపోవడమే తరచు ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం అవుతోందని ఆరోపించారు. దీంతో.. బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గెయిల్ నుంచి కూడా పరిహారం ఇప్పిస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ఢిల్లీనుంచి ఉన్నతాధికారులు వస్తున్నారన్నారు. క్షతగాత్రులను రాజోలు, అమలాపురం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమించిన 8 మందిని మాత్రం అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున అంతా నిద్రమత్తులో ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారికంగా 13 మంది మరణించినట్లు చెబుతున్నా, మృతులసంఖ్య ఇప్పటికే 18కి చేరినట్లు సమాచారం. మరో 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు వచ్చి, పరిసరాలు తీవ్రంగా వేడెక్కాయి. -
గెయిల్ ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి
న్యూఢిల్లీ : ఓఎన్జీసీ పైప్‌లైన్ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనపై ఆరా తీసిన ఆయన తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను ఆదేశించారు. మరోవైపు మంటలు అదుపులోకి వచ్చినట్లు టీపీడీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. పేలుడు ఘటనలో 13మంది సజీవ దహనం కాగా, మరో 15మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
పనిచేయని యాంటీ ఫైర్ పరికరాలు
యాంటీ ఫైర్ పరికరాలు పనిచేయకపోవడం వల్లే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పగిలి, భారీ అగ్నిప్రమాదం సంభవించిందంటున్నారు. దాదాపు వంద మీటర్ల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. మృతుల సంఖ్యను ప్రాథమికంగా 13 అని నిర్ధారించినా, అది కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలకు కూడా మంటలు వ్యాపించాయి. పొగలు దట్టంగా అలముకోవడంతో సహాయ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిపుణులు చేరుకున్నారు. గెయిల్ గ్యాస్ పైపులైన్లు తరచు లీకవుతున్నా, పాతబడిపోయిన పైపులైన్లను మార్చేందుకు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. ప్రస్తుతం రిఫైనరీకి కాకుండా, గ్రీన్‌బెల్ట్ వద్ద ప్రమాదం సంభవించడంతో తీవ్రత కొంతవరకు తగ్గినట్లేనని చెబుతున్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను బయటకు తీశారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సాంకేతిక పరమైన చర్యలు చేపట్టడానికి అవకాశం లేకపోతోంది. పైప్‌లైను పగుళ్లను నివారించడానికి, మంటలను అదుపుచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. నివాసప్రాంతాలకు సమీపంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా సంఘటన స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.