పేలుడుపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మోడీ ఆదేశించారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేబినెట్ కార్యదర్శి తదితరులతో కూడా మోడీ చర్చించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్ లైన్ పేలిన విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ పేలుడులో 18మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.
My thoughts with the families of those who lost their lives in the GAIL Pipeline fire in AP. Prayers with the injured.
— Narendra Modi (@narendramodi) June 27, 2014
గెయిల్ పేలుడు ఘటనపై ఇంకా కారణాలు తెలియరాలేదని గెయిల్ ఛైర్మన్ బీసీ త్రిపాఠి తెలిపారు. 18 అంగుళాల పైప్లైన్ వద్ద పేలుడు జరిగిందని ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. సంఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టినట్లు త్రిపాఠి పేర్కొన్నారు.
I have spoken to the Petroleum Minister, Cabinet Secretary & GAIL Chairman and asked them to ensure immediate relief at the accident site.
— Narendra Modi (@narendramodi) June 27, 2014