క్షతగాత్రుల్లో 15మంది పరిస్థితి విషమం
కాకినాడ : గెయిల్ పేలుడు ఘటనలో మొత్తం 15మంది మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి పద్మావతి అధికారికంగా ప్రకటించారు. మరో 32మంది గాయపడ్డారని, వారిలో 15మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. క్షతగాత్రులకు అమలాపురం ఏరియా ఆస్పత్రి సహా స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పద్మావతి చెప్పారు.
కాగా అధికారికంగా 15మంది మృతి చెందినట్లు చెబుతున్నా... 18మంది చనిపోయినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ మృతి చెందినవారిలో గోపిరెడ్డి దివ్యతేజ, మద్దాల బాలాజీగా గుర్తించారు.