బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: యనమల
న్యూఢిల్లీ : పైప్లైన్ పేలుడు ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. గ్యాస్ చాలా రోజుల నుంచి లీక్ అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారని యనమల పేర్కొన్నారు.
గ్యాస్ పైప్లైన్ తుప్పుపట్టి పాడైందని చెబుతున్నా.... అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు... నగరంలోని జీసీఎస్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని వాహనాన్ని ధ్వంసం చేశారు.