ఓఎన్జీసీ పైప్లైన్ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : ఓఎన్జీసీ పైప్లైన్ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనపై ఆరా తీసిన ఆయన తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను ఆదేశించారు. మరోవైపు మంటలు అదుపులోకి వచ్చినట్లు టీపీడీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. పేలుడు ఘటనలో 13మంది సజీవ దహనం కాగా, మరో 15మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.