తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మోడీ ఆదేశించారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేబినెట్ కార్యదర్శి తదితరులతో కూడా మోడీ చర్చించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్ లైన్ పేలిన విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ పేలుడులో 18మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.
Published Fri, Jun 27 2014 12:33 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement