మెక్సికో: మెక్సికో సరిహిద్దు బీచ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దాదాపు యాభై డాల్ఫిన్లు గాయాలతో బాజా కాలిఫోర్నియా సర్ బీచ్ ఒడ్డుకు కొట్టుకువచ్చాయని మెక్సికో అధికారులు తెలిపారు. పెద్ద డాల్ఫిన్లు దాడి చేయడం వల్లనే ఇవి ఒడ్డుకు వచ్చి ఉంటాయని వారు భావిస్తున్నారు. అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, జంతు ప్రేమికులు హుటాహుటిన బీచ్ తీరానికి చేరుకున్నారు.
మొత్తం 54 డాల్ఫిన్లు తీరానికి కొట్టుకురాగా, వాటిపై దాడిచేసిన గాయాలు కనిపించాయని వారు చెబుతున్నారు. ఎంతగానో శ్రమించి తిరిగి సముద్రంలోకి వెళ్లేలా చూడగా 33 డాల్ఫిన్ల ప్రాణాలు దక్కాయట. మరో 21 డాల్ఫిన్లు బాటిల్ నోస్ డాల్ఫిన్ల దాడిలో గాయపడటం వల్లే మరణించి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. అవి తీరానికి వచ్చిన వెంటనే వాటికి సాయం చేసి ఉంటే మరికొన్ని డాల్ఫిన్లు ప్రాణాలతో ఉండేవంటూ జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment