
షో మొదలైంది..
‘ఇండియా ఏవియేషన్-2014’ నగరంలో బుధవారం ప్రారంభమైంది. లోహవి‘హంగామా’కు బేగంపేట విమానాశ్రయం వేదికయింది. విదేశీ అతిథులతో కళకళలాడింది. తొలిరోజు బిజినెస్ సందర్శకులు సందడి చేశారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రత్యేకతలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. గగనతలంలో ప్రదర్శించిన విన్యాసాలు గగుర్పాటు కలిగించాయి.
- బేగంపేట, సనత్‌నగర్
చూడడానికి ఈ లోహవిహంగాలన్నీ చిన్నవే. కానీ ఆధునిక హంగులు వీటిసొంతం. గాలిలో ఎగురుతూనే మీటింగ్ పూర్తి చేయొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. విలాసవంతంగా విందారగించే సదుపాయాలెన్నో వీటిల్లో ఉన్నాయి. వీటిలో సీట్ల అమరిక.. మార్చుకునే విధానం చూస్తే పాతాళ
భైరవి సినిమా కచ్చితంగా గుర్తొస్తుంది. ఆపరేషన్ అంతా రిమోట్‌తోనే. సీట్లను 180 డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చు. ప్రత్యేక ఫర్నిచర్‌ను వినియోగించడంతో లుక్ జిగేల్‌మంటుంది.
( 51 వేల అడుగుల ఎత్తులో 12 గంటలు ఏకధాటిగా ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. (ఉదాహరణకు ఫ్రాన్స్‌లో బయలుదేరి ఆగకుండా ఇండియా చేరుకోవచ్చు) ( దీని తయారీదారు డసల్ట్ ఏవియేషన్. ఇందులో మొత్తం సీట్లు 14( ప్రయాణంలో ఉన్నామనే భావన దరి చేరనీయకుండా ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు. ( రేంజ్: 5950 నాటికల్‌మైళ్లు( సర్వీస్ సెయిలింగ్: 15,545 మీటర్లు ( పొడవు: 29.19 మీటర్లు ( ఎత్తు: 7.83 మీటర్లు ( బరువు: 15,545 కేజీలు ( టేకాఫ్ వెయిట్: 31,300 కేజీలు( ల్యాండింగ్ వెయిట్: 28,305 కేజీలు
పసిగట్టేస్తా
న్సర్ పరిజ్ఞానంతో ఎయిర్‌పోర్ట్‌లోని ఏ మూలన ఎలాంటి కదలిక జరిగినా క్షణాల్లో టీవీ స్క్రీన్‌పై చూపించడమే కాదు.. అలారం సాయంతో హెచ్చరికలు జారీ చేసే సరికొత్త పరిజ్ఞానం ‘ఫెన్స్ షాక్ డిటెక్షన్ సిస్టమ్’ ప్రత్యేకత. ఒక్క ఎయిర్‌పోర్ట్‌లోనే కాకుండా మనకు కావలసిన నిర్దేశిత ప్రదేశాల్లో ఈ సిస్టమ్ సాయంతో అజ్ఞాత వ్యక్తులు కదలికల్ని గమనించి క్షణాల్లో అప్రమత్తం చేస్తుంది. ఎవరికీ కనిపించకుండా ఉండేలా సెన్సర్లను భూమిలో అమరుస్తారు. ఇవి మాస్టర్ నోడ్‌కు అనుసంధానమై ఉంటాయి. మాస్టర్ నోడ్ ఎన్‌కోడర్‌కు కనెక్టై సెంట్రల్ కంట్రోల్ సహాయంతో స్క్రీన్‌పై కదలికలను చూపిస్తుంది. ఒక్కో మాస్టర్ నోడ్‌కు 30 మీటర్ల దూరంలో 30 వరకు సెన్సార్‌లను అమర్చుకుంటూ వెళ్లవచ్చు. దీని ద్వారా కిలోమీటర్ల మేర నిర్దేశించుకున్న పరిధిలో వాహనాలు, మనుషులు ఇతరత్రా కదలికలు తెలుసుకునే అవకాశం ఉంది. ఏవియేషన్ ఎగ్జిబిషన్‌లో ఓ స్టాల్‌లో వీటి గురించి వివరిస్తున్నారు.
ఏం దాచారో చెప్పేస్తా
సాధారణంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, షాపింగ్‌మాళ్లు, సినిమా హాళ్లలో భద్రతా కారణాల దృష్ట్యా మనం తీసుకెళ్లే లగేజీని స్కానర్లతో తనిఖీ చేస్తారు. మనుషులకోసం లోహాలను పసిగట్టే మెటల్‌డిటెక్టర్‌ను వినియోగిస్తారు. మరి అసాంఘిక శక్తులు ఆర్డీఎక్స్, నిషేధిత వస్తువులు, రహస్య సమాచారం కలిగిన పెన్‌డ్రైవ్‌లు, సీడీలను తాము వేసుకున్న దుస్తుల్లో పెట్టి తరలిస్తుంటారు. మరి అలాంటి వారి సంగతేంటి అనేగా మీ ప్రశ్న... ఇలాంటి వారిని పసిగట్టి భద్రతా వ్యవస్థను తట్టిలేపే అధునాతన టెక్నాలజీతో తయారైన ‘బాడీస్కానర్’ను ఏవియేషన్ షోలో ప్రదర్శిస్తున్నారు. స్క్రీన్ ముందుభాగంలో నిర్దేశిత ప్రదేశంలో నిలబడితే... దేహాన్ని మొత్తం ఈ పరికరం కేవలం సెకెండ్ల వ్యవధిలో స్కాన్ చేస్తుంది. కడుపులో ఉన్న వస్తువుల్ని సైతం టీవీ స్క్రీన్‌పై చూపిస్తుంది. గుండుసూది కంటే చిన్నవైన వస్తువుల్ని సైతం గుర్తించగలిగే పరిజ్ఞానం దీని సొంతం. దీని వినియోగం వలన ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవని తయారీదారులు చెబుతున్నారు.