మహేష్ బాబును కలవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే! | mahesh babu wife Namrata Shirodkar sets the rules for visitors | Sakshi
Sakshi News home page

మహేష్ బాబును కలవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే!

Published Sat, Nov 22 2014 12:23 PM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

మహేష్ బాబును కలవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే!

మహేష్ బాబును కలవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే!

ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.... సెక్యూరిటీ సిబ్బందికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. తమ అనుమతి లేకుండా ఎవరినీ లోనికి అనుమతించవద్దని హెచ్చరించారు. ఇంతకు నమ్రతా ఎందుకలా సీరియస్ అయ్యారు. అసలు విషయానికి వస్తే మహేష్ బాబు 'ఆగడు' ఫెయిల్యూర్తో నమత్రా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్ట్లపై ఆమె దృష్టి పెట్టినట్లు సమాచారం. గతంలో మహేష్ బాబుకు కథ చెప్పేందుకు చాలామంది నిర్మాతలు...   ఎలాంటి సమాచారం కానీ, అపాయింట్మెంట్ గానీ తీసుకోకుండా డైరెక్ట్గా కలిసేవారు. అయితే అదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడు రూల్స్ మారిపోయాయి.

ఎవరైనా సరే....మహేష్ బాబును కలవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే. ఇటీవల మహేష్ బాబు.. ఓ నిర్మాత...దర్శకుడితో కలిసి కథ చెప్పేందుకు ఆయన ఇంటికి వెళ్లాడు. వాళ్లు కథ వినిపించేసి వెళ్లిపోయారు.  అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత...తమకు సమాచారం ఇవ్వకుండా వాళ్లను లోనికి ఎందుకు పంపించారని నమ్రతా శిరోద్కర్ ...సెక్యూరిటీకి క్లాస్ పీకారట. మరోసారి ఇటువంటివి రిపీట్ కావద్దొంటూ గట్టిగానే ఆదేశించినట్లు సమాచారం.

 

కాగా మహేష్ బాబుకు సన్నిహితంగా ఉండే ఓ నిర్మాత కూడా నమ్రత కొత్త నిబంధనతో వాళ్ల ఇంటి దరిదాపులకు కూడా రావటం లేదట. మహేష్ బాబు కూడా 'భజన గ్యాంగ్'ను దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మహేష్ బాబును కలవాలంటే ముందుగా నమత్ర వద్ద అనుమతి తీసుకోవాల్సిందే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement