సాక్షి, చార్మినార్(హైదరాబాద్): నగర చరిత్రలో చార్మినార్‌కు ఎంత గుర్తింపు ఉందో పక్కనే ఉన్న లాడ్‌బజార్‌కూ అంతే గుర్తింపు ఉంది. ఎక్కడేక్కడి నుంచో వచ్చి చార్మినార్‌ను సందర్శిచిన తర్వాత లాడ్‌బజార్‌లోకి అడుగు పెడతారు. వందలు, వేలల్లో ఉండే అందమైన డిజైన్ల గాజులను కొనుగోలు చేస్తుంటారు. ఏ పండగొచ్చినా.. పెళ్లిళ్ల సీజన్ మొదలైనా మొదట గుర్తుకు వచ్చేది లాడ్ బజారే.. వందల సంఖ్యలో ఉన్న షాపులను నిత్యం వేలాది మంది సందర్శిస్తుంటారు.
రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి గాజులు ఎగుమతి అవుతుంటాయి. అందమైన గాజులు తక్కువ ధరలకే లభ్యమవుతుండటంతో ఇక్కడి గాజులకు డిమాండ్ కూడా అధికంగానే ఉంటోంది. నిత్యం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే విదేశీయులు సైతం గాజులను కొనుగోలు చేసి వారి దేశాలకు తీసుకెళ్తుంటారు.
రాత్రిపూట లాడ్‌బజార్‌లోకి వెళ్తే జిగేల్‌మంటూ మెరిసే గాజుల అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఇంతటి పేరుగాంచిన లాడ్‌బజార్‌ను నైట్ బజార్‌గా మార్చాలని 1999లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానిక గాజుల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు గానీ.. ఇటు సంబంధిత అధికారులు గానీ.. నైట్ బజార్ విషయాన్ని పట్టించుకోవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నైట్ బజార్‌గా మారిస్తే పాతబస్తీకి మరింత వన్నె తెచ్చినట్లవుతుందని అంటున్నారు. ఏళ్లుగా గాజుల విక్రయాలతోనే జీవనం సాగిస్తున్న వ్యాపారుల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.
► దూరప్రాంతాల నుంచి షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చే వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్
నిర్మిస్తే ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి విముక్తి లభిస్తుంది. పార్కింగ్‌కు సౌకర్యం కల్పిస్తేనే వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది.
► పరిసరాల రోడ్లన్నీంటినీ వెడల్పు చేయాలి. చార్మినార్ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లను పూర్తిగా అందుబాటులోకి తేవాలి. లాడ్‌బజార్‌లో వ్యాపారాభివృద్ధి కోసం ఇక్కడి దుకాణాలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కల్పించాలి.
ఆ పేరెలా వచ్చిందంటే..
►లాడ్లా అంటే గారాబం.. ప్రేమ.. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని, ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమ, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకలను కొని బహుకరిస్తుండటంతో ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు.
► మహ్మద్ కూలీ కుతుబ్‌షా కూడా తాను ప్రేమించిన భాగమతికి ఇక్కడి లాడ్‌బజార్‌లోని గాజుల్నే బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కి పైగా దుకాణాలు నిత్యం తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment