
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజముద్రలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర చిహ్నం మారుస్తోందని దుయ్యబట్టారు. చార్మినార్ ముద్రను తీసేయడం హైదరాబాదీలను అవమానించడమే.. కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
మరోవైపు, రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. చార్మినార్ దశాబ్దాల తరబడి హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. నగరం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్న చార్మినార్ గురించి ఆలోచించకుండా ఉండలేరని... కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని భావిస్తోందని మండిపడ్డారు.
World over, Charminar has been the icon/symbol of Hyderabad for centuries
When one thinks of Hyderabad, they cannot but think of Charminar which has all the qualities of a UNESCO world heritage site
Now Congress Government wants to remove the iconic Charminar from the state… pic.twitter.com/SQVxQAI6lL— KTR (@KTRBRS) May 30, 2024

Comments
Please login to add a commentAdd a comment