బైబై నుమాయిష్ | Baibai numayis | Sakshi
Sakshi News home page

బైబై నుమాయిష్

Published Mon, Feb 17 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

Baibai numayis

అబిడ్స్, న్యూస్‌లైన్:  నలభై ఏడు రోజులు నగరవాసులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని పంచి... వినోదాల విందు చేసి... అభి‘రుచు’లకు అడ్డాగా మారిన 74వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్) ఆదివారంతో ముగి సింది. ఆఖరి రోజు... సెలవుదినం కూడా కావడంతో ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి స్టాలూ కళకళలాడింది. వినోదాల పార్కు కేరింతలతో మురిసిపోయింది. చుక్‌చుక్‌రైలు ‘బ్రేక్’ లేకుండా మైదానమంతా చుడుతూనే ఉంది. ఫుడ్‌కోర్టులు ఘుమఘుమలతో ఘాటెక్కించాయి. మొత్తానికి చివరి రోజు నుమాయిష్‌లో జోష్ అంచులను తాకింది. ఎటు చూసినా జనకళతో జోరుగా కనిపించింది. లోపలే కాదు... మైదానం వెలుపలా అదే సందడి.
 
20.3 లక్షలమంది
ఈ ఒక్కరోజే దాదాపు 70 వేలకు పైగా సందర్శకులు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. జనవరి ఒకటిన ఆరంభమైన నుమాయిష్‌ను మొత్తం కలిపి 20.30 లక్షల మంది సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement