
గన్‌ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిస్) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది, పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్‌ను రోజూ వేల సంఖ్యలో సందర్శకులు సందర్శించినట్లు బుకింగ్ కమిటీ ఛైర్మన్ హన్మంతు తెలిపారు. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్‌ను 4 లక్షలకు పైగా సందర్శించినట్లు తెలిపారు.
ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారిమళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment