కడెంలో ప్రముఖుల సందడి
కడెం : కడెంకు మునుపెన్నడూ లేని విధంగా ఒక్కరోజే ప్రముఖల సందడి ఏర్పడి ఏర్పడింది. ఆదివార ం ఉదయం నుంచే ప్రముఖుల తాకిడి మొదలైంది. కలెక్టర్ జగన్మోహన్ కుటుంబ సమేతంగా ఒక రోజు ముందే కడెం రిసార్స్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు పీసీసీఎఫ్ పీకే ఝా, అడిషనల్ పీసీసీఎఫ్ పీ మధుసూదన్ రావు, టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ ఎస్‌కే గుప్త ఆదివారం ఉదయం కడెంకు వచ్చారు. వారి వెంట సీఎఫ్ తిమ్మారెడ్డి, నిర్మల్, జన్నారం డీఎఫ్వోలు రాంకిషన్‌రావు, రవీందర్, కడెం ఎఫ్‌ఆర్వో నాగయ్య ఉన్నారు. మధ్యాహ్న సమయంలో జిల్లా జడ్జి ఉదయగౌరి కుటుంబసమేతంగా కడెం ప్రాజెక్టును సందర్శించారు.
కుటుంబ సభ్యులతో కలిసి పడవలో జలాశయంలో విహరించారు. హరితారిసార్ట్స్, కడెం ప్రాజెక్టును మంచిర్యాల, ఖానాపూర్ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రేఖానాయక్ సందర్శించారు. సాయంత్రం కడెం ప్రాజెక్టు, బోటింగు కేంద్రం వద్ద పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. వందల సంఖ్యలో పర్యాటకులు వాహనాల్లో రావడంతో ప్రాజెక్టుపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను నియంత్రించారు. చాలా రోజుల తర్వాత ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది.