న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీం కోర్టు హాలులో లాయర్లందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దివ్యాంగులైన తన ఇద్దరు పెంపుడు కూతుళ్లను ఆయన న్యాయస్థానానికి తీసుకువచ్చారు. విజిటర్స్ గ్యాలరీ గుండా వారిద్దరినీ ఫస్ట్‌కోర్ట్‌కు తీసుకువచ్చారు. తను కూర్చునే చాంబర్‌ను చూపించారు.
ఇతర జడ్జీలు కూర్చుని ఉండే చోటును, లాయర్లు వాదించే సమయంలో ఎక్కడి ఉండేదీ వారికి చెబుతూ.. కోర్టు పని విధానాన్ని వివరించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. వచ్చిన అతిథులను చూసి న్యాయవాదులంతా ఆశ్చర్యానికి గురయ్యారని పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: Haldwani Eviction: సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు?
Comments
Please login to add a commentAdd a comment