ఆగ్రా : తాజ్ మహల్ సందర్శకులకు ఇక నుంచి టైమ్ పరిమితిని విధించనున్నారు. రద్దీని, కాలుష్య సమస్యను అరికట్టడానికి ఇక నుంచి తాజ్ మహల్ వద్ద కేవలం మూడు గంటలు మాత్రమే పర్యాటకులు గడిపేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) పరిమితి విధించబోతోంది. ఈ మేరకు ఏఎస్‌ఐ ఓ నోటీసును జారీచేసింది. ఆదివారం(ఏప్రిల్ 1) నుంచి ఈ కొత్త సిస్టమ్ అమల్లోకి రానుందని తెలిపింది. ఇప్పటి వరకు సందర్శకులు సాయంత్రం ఆ ప్రేమ మందిరం మూసే వరకు అక్కడ గడిపే సమయం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సిస్టమ్‌ను తీసేయనున్నారు.
‘హ్యుమన్ పొల్యూషన్’పై ఇప్పటికే పలు రిపోర్టులు హెచ్చరిస్తూ వచ్చాయి. తాజ్ వద్ద గడిపే సమయంపై పరిమితి విధిస్తేనే ఈ సమస్యను పరిష్కరించవచ్చని పలువురు నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే. వీకెండ్లలో, సెలవుల్లో ఈ ప్రేమ మందిరాన్ని సందర్శించడానికి 50వేల మందికి పైగా సందర్శిస్తూ ఉంటారు. అయితే ఎంతమంది పిల్లలు సందర్శిస్తారో ఇక రికార్డులు లేవు. 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి ఈ తాజ్ మహల్ సందర్శన ఉచితం. దీంతో హ్యుమన్ కాలుష్యం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టైమ్ పరిమితిని ఏఎస్‌ఐ తీసుకురాబోతోంది. కొత్త సిస్టమ్ ప్రకారం టైమ్ పరిమితి దాటి తాజ్ వద్ద ఎవరైనా ఎక్కువ సమయం వెచ్చిస్తే, అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఏఎస్‌ఐ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment