Taj Mahal visit
-
తాజ్ మహల్ మూసివేత
ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. భారత్‌లో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 130కి చేరింది. మూడు మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలన్న ఉద్ధేశంతో మార్చి 31 వరకు దేశంలోని పాఠశాలలు, యూనివర్సిటీలతో సహా థియేటర్లు, వ్యాయామ శాలలు మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం నుంచి తాజ్ మహల్ సందర్శనను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ప్రకటించింది. (ఆఫీసుకు తాళం వేసిన పూరీ, ఛార్మి) ఈ మేరకు ‘కరోనా వ్యాప్తి దృష్ట్యా టిక్కెట్లు ద్వారా ప్రవేశించే అన్ని చారిత్రక కట్టడాలు, అన్ని స్మారక చిహ్నాలు, కేంద్ర మ్యూజియాలను, ఎర్రకోట, తాజ్ మహాల్ మార్చి 31 వరకు మూసివేస్తున్నాం. దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రకటించారు. వీటితోపాటు దేశంలోని పలు దేవాలయాల్లో భక్తుల రాకపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. మహారాష్ట్రలోని షిరిడి, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం కూడా మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తాజ్ మహల్ మూతపడటం ఇది మూడోసారి. మొదటి సారి 971లో పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో.. అలాగే 1978లో వరదల నేపథ్యంలో రెండో సారి కొన్ని రోజుల పాటు సందర్శనను నిలిపి వేశారు. (కోహ్లి, సానియాకు చాలెంజ్ విసిరిన సింధు) పాకిస్తాన్లో తొలి కరోనా మరణం కరోనా: వివాదం రేపిన ట్రంప్ ట్వీట్ -
తాజ్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్: ఇవాంకా
న్యూఢిల్లీ: నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్ చేసిన ఓ ట్వీట్ ట్విట్టర్‌ను ఊపేస్తోంది. దీనికి కారణం ఆ ట్వీట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు రిప్లై ఇవ్వడమే. వివరాల్లోకి వెళితే.. ఇవాంకా ట్రంప్ ఇటీవల భారత పర్యటనలో తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె తాజ్‌మహల్ వద్ద దిగిన ఓ ఫొటోను దిల్జిత్ ఫొటోషాప్ ఉపయోగించి మార్ఫింగ్ చేసి, ఇవాంకా పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. ‘నేనే తనను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లాను.. అంతకంటే ఏం చేయగలను ?’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై ఇవాంకా స్పందిస్తూ.. ‘నన్ను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు. దీన్ని నేనెప్పటికీ మరచిపోలేను.’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై దిల్జిత్ స్పందిస్తూ.. ‘ఓ మైగాడ్.. కృతజ్ఞతలు ఇవాంకా ! ఇది ఫొటోషాప్ చేసిన చిత్రం కాదని అందరికీ చెప్పేప్రయత్నం చేస్తున్నారు. ఈసారి లూథియానాకు రండి’ అన్నారు. దీనిపై మళ్లీ స్పందించిన ఇవాంకా ‘భారతీయ అభిమానులను అభినందిస్తున్నా’ అంటూ ఫొటోషాప్ చేసిన మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు. తనపై ఫొటోషాప్ చేసిన ఫొటోలపై ఇవాంకా సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడంతో ట్విట్టర్లో నవ్వులు పూశాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇవాంకా ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు -
తాజ్ అందాల్ని పూర్తిగా ఆస్వాదించాను
-
'తాజ్ అందాలు నన్ను మైమరిపించాయి'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి వెళ్లిపోయి రెండు రోజులవుతుంది. అయినా ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా వారి పర్యటనపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ తాజ్ అందాలను ఆస్వాదించిన వీడియోనూ తన ట్విటర్లో షేర్ చేశారు. ' ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా ఉన్న తాజ్‌మహల్‌ను దగ్గర నుంచి చూడడం ఆనందం కలిగించింది. తాజ్ అందాల్ని పూర్తిగా ఆస్వాదించానంటూ' క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మొత్తం 47 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో తన భర్త ట్రంప్ ట్రంప్‌తో కలిపి చేతిలో చేయి వేసుకొని తాజ్‌మహల్‌లో కలియ తిరగడం కనిపించింది. నితిన్ కుమార్ గైడ్‌గా వ్యవహరిస్తూ తాజ్‌మహల్ విశిష్టతను, దానియొక్క చరిత్రను వారికి వివరించారు. కాగా డేవిడ్ ఐసనోవర్, బిల్ క్లింటన్, తర్వాత తాజ్ మహల్‌ను వీక్షించిన మూడో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గుర్తింపు పొందారు. (‘తాజ్’అందాలు వీక్షించిన ట్రంప్ దంపతులు) -
అతి పెద్ద స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’..!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24న భారత పర్యటకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో అత్యంత పెద్దదిగా భావిస్తున్న గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ క్రికెట్ స్టేడియాన్ని ప్రధాని మోదీతో కలిసి ఆవిష్కరించనున్నారు. అనంతరం స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ఇరు దేశాధినేతలు పాల్గొంటారు. ఈమేరకు వైట్ హౌజ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘చైనాకు ధీటుగా ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశం భారత్’ అని వైట్ హౌజ్ పేర్కొంది. మొతేరా ప్రాంతంలో నూతనంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ క్రికెట్ స్టేడియం కెపాసిటీ లక్ష.ట్రంప్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ట్రంప్ పర్యటన నేపథ్యంలో అమెరికా భద్రతా వాహనాలు అహ్మదాబాద్ చేరుకుంటున్నాయి. (ట్రంప్ విమాన సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే..!) ‘భారత్-అమెరికా ప్రజల సంబంధాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం దానిని పతిబింబించేలా ఉటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. ట్రంప్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరోస్థాయికి తీసుకెళ్తాయని అన్నారు. ట్రంప్‌నతో కలిసి ఆయన భార్య, అమెరికా మొదటి మహిళా మెలానియా ట్రంప్ కూడా భారత్‌లో పర్యటిస్తారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం అనంతరం వారు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. (ట్రేడ్ డీల్‌పై ట్రంప్ కీలక ప్రకటన) -
ప్రేమ చిహ్నంతో.. ఐఏఎస్ లవ్‌బర్డ్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఏఎస్ ప్రేమపక్షులు అమీర్ ఉల్ షఫీ, టీనా దాబీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో వివాదాల నడుమ ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ప్రేమకు చిహ్నమైన తాజ్మహాల్తో సరదాగా ఫోటోలకు పోజులిచ్చారు. వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘ శాశ్వతమైన ప్రేమకు అద్భుతమైన శ్మారక చిహ్నమైన తాజ్‌మహాల్ వద్ద నా హుబ్బీతో’’ అని వారు షేర్ చేసిన ఫోటోలకు కామెంట్ పెట్టారు. వారి విహహం అనంతరం తొలిసారి విజిటింగ్‌కు బయటకు వచ్చినట్లు ఆమె తెలిపారు. తాజ్ మహాల్, ఫతేపూర్ సిక్రీ వంటి ప్రదేశాలను వారు సోమవారం సందర్శించారు. 2015 సివిల్స్ టాపరైన టీనా దాబీ తన జూనియర్ అయిన అమీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఐఏఎస్ అఫీసర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కానీ వీరి పెళ్లికి మాత్రం పలు హిందూ సంఘాలు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీనా ఐఏఎస్ టాపరై ఉండి ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటని విశ్వ హిందూ మహా సభ బహిరంగంగానే విమర్శించిన విషయం తెలిసిందే. అయినా అవేవి పట్టించుకుకోని ఆ జంట 2018లో అమీర్ స్వస్థలమైన కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వివాహంతో ఒకటైయారు. -
తాజ్ సందర్శకులకు టైమ్ లిమిట్
ఆగ్రా : తాజ్ మహల్ సందర్శకులకు ఇక నుంచి టైమ్ పరిమితిని విధించనున్నారు. రద్దీని, కాలుష్య సమస్యను అరికట్టడానికి ఇక నుంచి తాజ్ మహల్ వద్ద కేవలం మూడు గంటలు మాత్రమే పర్యాటకులు గడిపేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) పరిమితి విధించబోతోంది. ఈ మేరకు ఏఎస్ఐ ఓ నోటీసును జారీచేసింది. ఆదివారం(ఏప్రిల్ 1) నుంచి ఈ కొత్త సిస్టమ్ అమల్లోకి రానుందని తెలిపింది. ఇప్పటి వరకు సందర్శకులు సాయంత్రం ఆ ప్రేమ మందిరం మూసే వరకు అక్కడ గడిపే సమయం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సిస్టమ్‌ను తీసేయనున్నారు. ‘హ్యుమన్ పొల్యూషన్’పై ఇప్పటికే పలు రిపోర్టులు హెచ్చరిస్తూ వచ్చాయి. తాజ్ వద్ద గడిపే సమయంపై పరిమితి విధిస్తేనే ఈ సమస్యను పరిష్కరించవచ్చని పలువురు నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే. వీకెండ్లలో, సెలవుల్లో ఈ ప్రేమ మందిరాన్ని సందర్శించడానికి 50వేల మందికి పైగా సందర్శిస్తూ ఉంటారు. అయితే ఎంతమంది పిల్లలు సందర్శిస్తారో ఇక రికార్డులు లేవు. 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి ఈ తాజ్ మహల్ సందర్శన ఉచితం. దీంతో హ్యుమన్ కాలుష్యం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టైమ్ పరిమితిని ఏఎస్ఐ తీసుకురాబోతోంది. కొత్త సిస్టమ్ ప్రకారం టైమ్ పరిమితి దాటి తాజ్ వద్ద ఎవరైనా ఎక్కువ సమయం వెచ్చిస్తే, అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఏఎస్ఐ అధికారులు చెప్పారు. -
అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!
న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాల కిందట అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐషనోవర్ తాజ్‌మహల్‌ను సందర్శించినపుడు ఉన్న భధ్రతా ఏర్పాట్లకు, ఇప్పుడు అదే అమెరికాకు అధ్యక్షుడైన బరాక్ ఒబామా అదే తాజ్‌మహల్ సందర్శనకు వస్తున్నపుడు చేపడుతున్న భద్రతా ఏర్పాట్లకు ఏ మాత్రం పొంతన లేదు. ఆగ్రాలోని ఈ చారిత్రక కట్టడాన్ని సందర్శించేందుకు వస్తున్న ఒబామాకు భద్రత కల్పించేందుకు 4,000 మందికి పైగా పోలీసు సిబ్బంది, 100 మంది అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, బులెట్‌ప్రూఫ్ వాహనాలు, గగనతలంలో హెలికాప్టర్లతో నిఘా, యమునా నదిలో మోటార్బోట్లతో పహారాతో కనీవినీ ఎరుగని భత్రతా చర్యలు చేపడుతున్నారు. ఖేరియా విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్ వరకూ 11 కిలోమీటర్ల దూరమంతా సీసీటీవీలను అమర్చటంతో పాటు రహదారి పొడవునా కూడళ్లలోనూ, భవనాల పైకప్పులపైనా కమాండోలనూ మోహరిస్తున్నారు. పొరుగు నగరాల నుంచి విమానాల ప్రయాణాలనూ నిలిపివేస్తున్నారు. కానీ, 1959 డిసెంబర్లో నాటి అమెరికా అధ్యక్షుడు ఐషనోవర్(1953-1961) పైకప్పు కూడా లేని ఓపెన్ కాడిలాక్ కారులో రోడ్డుకు ఇరువైపులా నిల్చుని నినాదాలు చేస్తున్న భారీ ప్రజా సమూహాలకు చేతులూపి అభివాదం చేస్తూ నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూతో కలిసి ఇదే తాజ్‌మహల్‌ను సందర్శించారు. 'ఇద్దరు దేశాధినేతల వెంటా మరో 100 మందికి పైగా ఇతరులు కూడా ఉన్నారు. వారంతా 15 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్న నీటి ఫౌంటెన్ల పక్క నుంచి, ట్యాంకుల్లో స్వచ్ఛమైన నీటిలో అలంకరించిన పూల పక్కగా మధ్య దారిలో నడుస్తూ సందర్శించారు. అమెరికా అధ్యక్షుడికి తాజ్ నిర్మాణ కళానైపుణ్య విశేషాలను వివరిస్తున్న నెహ్రూ మాటలను వినగలిగేంత దూరంలోనూ జనం ఉన్నారు' అని నాటి కార్యక్రమానికి హాజరైన సీనియర్ పాత్రికేయుడు ఎన్.ఆర్.స్మిత్ వివరించారు. ''నాడు ఐషనోవర్ తాజ్‌మహల్ నుంచి సర్క్యూట్ హౌస్ వద్దకు వెళ్లి, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిచ్పురి గ్రామానికి వెళ్లారు. భారతీయ గ్రామాన్ని సందర్శించాలన్న ఆయన కోరిక మేరకు సమీపంలోని లార్మ్దా గ్రామానికి నెహ్రూ తీసుకెళ్లారు. అక్కడి ఇరుకు రోడ్ల గుండా ప్రయాణించిన అమెరికా అధ్యక్షుడి మోటారు వాహనాల కాన్వాయ్ కొంత దూరం వెళ్లాక బురదతో నిండిన మట్టి రోడ్లపై ప్రయాణించలేకపోవడంతో అక్కడే ఆపివేశారు. గుంతలతో నిండివున్న ఆ రోడ్లపై ఐషనోవర్ కాలినడకన జాగ్రత్తగా నడుస్తూ గ్రామాన్ని సందర్శించారు. స్వల్ప సంఖ్యలో ఉన్న భద్రతా సిబ్బంది చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే, అధ్యక్షుడి ఫొటోలు తీసుకోవటానికి పత్రికల ఫొటోగ్రాఫర్లు రోడ్లకు ఇరువైపులా ఉన్న ఇళ్ల మీదకు ఎక్కారు. గ్రామంలో 300 మంది గ్రామస్థులతో సభను ఏర్పాటు చేయగా, అమెరికా అధ్యక్షుడిని వారికి నెహ్రూ పరిచయం చేశారు. ఐషనోవర్ మాత్రం కేవలం 'గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, థాంక్యూ' అన్న నాలుగు మాటలే మాట్లాడారు'' అని ఇప్పుడు 80 ఏళ్ల వయసులో ఉన్న స్మిత్ పేర్కొన్నారు.