అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి వెళ్లిపోయి రెండు రోజులవుతుంది. అయినా ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా వారి పర్యటనపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ తాజ్ అందాలను ఆస్వాదించిన వీడియోనూ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ' ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా ఉన్న తాజ్‌మహల్‌ను దగ్గర నుంచి చూడడం ఆనందం కలిగించింది. తాజ్ అందాల్ని పూర్తిగా ఆస్వాదించానంటూ' క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మొత్తం 47 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో తన భర్త ట్రంప్ ట్రంప్‌తో కలిపి చేతిలో చేయి వేసుకొని తాజ్‌మహల్‌లో కలియ తిరగడం కనిపించింది. నితిన్ కుమార్ గైడ్‌గా వ్యవహరిస్తూ తాజ్‌మహల్ విశిష్టతను, దానియొక్క చరిత్రను వారికి వివరించారు. కాగా డేవిడ్ ఐసనోవర్, బిల్ క్లింటన్, తర్వాత తాజ్ మహల్‌ను వీక్షించిన మూడో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గుర్తింపు పొందారు. (‘తాజ్’అందాలు వీక్షించిన ట్రంప్ దంపతులు)
Comments
Please login to add a commentAdd a comment