Time limit
-
Health: మాయ ‘తెర’కు పరిమితులు..
‘చిన్నీ.... పడుకో...’‘ఫైవ్ మినిట్స్ మమ్మీ...’‘ఫైవ్ మినిట్స్ అంటావు....గంటలకొద్దీ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటావు. త్వరగా లేవడానికి మాత్రం ఏడుస్తుంటావు’.....ఇలాంటి మాటలు ఎన్నో ఇండ్లలో వినిపిస్తుంటాయి.సాధారణంగా పెద్దవాళ్లు ‘నిద్రలేమి’ సమస్యను ఎదుర్కుంటారు. అయితే స్వీడన్లో మాత్రం పిల్లలు కూడా ‘నిద్రలేమి’కి గురవుతున్నారు. దీనికి కారణం వారు ఎక్కువ సమయం డిజిటల్ మీడియా, టీవీల ముందు గడపడమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పిల్లల స్క్రీన్ టైమ్‌కు సంబంధించి తల్లిదండ్రులు పరిమితులు విధించాలని సూచించింది. రెండు నుంచి అయిదు సంవత్సరాల మధ్య పిల్లలు రోజుకు ఒక గంట, ఆరు నుంచి పన్నెండేళ్ల వయసు మధ్య ఉన్న పిల్లలు గంట లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ‘స్క్రీన్టైమ్’ ఉండేలా చూసుకోవాలన్నారు.ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపం అనేది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో వారి స్క్రీన్ టైమ్‌పై పరిమితులు విధించడం తప్పనిసరి అంటుంది స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ. స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ మార్గదర్శకాలు స్క్రీన్ టైమ్ తగ్గించడానికే కాదు పిల్లల అలవాట్లలో మార్పు తేవడానికి ఉద్దేశించినవి కూడా. ‘బెటర్ స్లీప్ హైజీన్’లో భాగంగా రాత్రి సమయంలో పిల్లల బెడ్రూమ్లో ఫోన్లు, ట్యాబ్లాంటివి దూరంగా పెట్టాలని ఏజెన్సీ తల్లిదండ్రులకు సూచించింది.స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గణాంకాల ప్రకారం పదమూడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు వారు ఆరు లేదా అంతకంటే ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. దీని వల్ల ఫ్యామిలీ ఇంటక్షరాక్షన్, ఫిజికల్ యాక్టివిటీలకు దూరం కావడమే కాదు ‘నిద్రలేమి’ ‘డిప్రెషన్’...మొదలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు.పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం అనేది మన దేశంలోనూ పెద్ద సమస్యగా మారింది. ‘అధిక స్క్రీన్ టైమ్’ వల్ల కలిగే నష్టాలను పిల్లలకు అర్థమయ్యేలా చెబితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. -
వ్యాక్సిన్‌లో ఎందుకింత గ్యాప్..!
ఎందుకు? ఎప్పుడు? ఎలా? కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ రెండు డోసుల వ్యవధిపై సామాన్య జనానికి వస్తున్న సందేహాలివి. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? కేంద్రం డోసుల వ్యవధిని ఎందుకు పెంచుకుంటూ పోతోంది? ఇలాగైతే ఎలా? వీటన్నింటి చుట్టూ పెద్ద వివాదానికే తెరలేచింది. ఆ వివాదం ఏంటి? కేంద్రం ఏం చెబుతోంది? బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ (కోవిషీల్డ్) రెండు డోసుల మధ్య వ్యవధిపై వివాదం నెలకొంది. పుణేకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి అత్యవసర అనుమతులు మంజూరు చేసినప్పుడు 4 –6 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని కేంద్రం నిర్దేశించింది. జనవరి 16న తొలిదశ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక అలాగే ఇచ్చారు. మార్చి 23న రెండు డోసుల మధ్య వ్యవధిని 6–8 వారాలకు పెంచింది. ఆ తర్వాత మళ్లీ మే 13న హఠాత్తుగా వ్యవధిని ఒకేసారి 12–16 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇలా గడువు ఎందుకు పెంచుతోందని సామాన్య ప్రజలు గందరగోళానికి లోనవుతూ ఉంటే, శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ మధ్య ఏకంగా 12–16 వారాల వ్యవధి మంచిది కాదని, దానిని తగ్గించాలని ఒక వర్గం శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యవధి తగ్గించాలని ఎందుకు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం రెండు డోసుల వ్యవధి పెంచిన తర్వాత జరిగిన అధ్యయనాల్లో కోవిషీల్డ్ సింగిల్ డోసుతో కేవలం 33% రక్షణ మాత్రమే వస్తుందని రెండు డోసులు తీసుకున్నాక 65 నుంచి 85% వరకు కరోనా నుంచి రక్షణ వస్తుందని తేలింది. భారత్‌లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌తో ముప్పు పొంచివుండటంతో వ్యాక్సినేషన్ రక్షణ లభిస్తే... ప్రాణహాని తగ్గుతుందని, సీరియస్ కా కుండా ఉంటుందని వాదిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా రెండోడోసును 8–12 వారాల మధ్య ఇవ్వాలని సిఫారసు చేయడం గమనార్హం. దీంతో పలు దేశాలు డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తున్నాయి. కేంద్రం చెబుతున్నదేంటి! కోవిషీల్డ్ కనిష్ట వ్యవధిని ఒక్కసారిగా రెట్టింపు చేస్తూ 84 రోజులకు పెంచడంపై విమర్శలు రావడంతో కేంద్రం వివరణ ఇచ్చింది. శాస్త్రీయ డేటాను విశ్లేషించిన తర్వాత టీకా డోసుల మధ్య వ్యవధి పెంచామని, ఈ నిర్ణయాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఎన్టీఏజీఐ, కేంద్రం ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ గడువు 12 వారాలకు పెంచాలని అప్పట్లో కమిటీ కేంద్రానికి రాసిన లేఖ ప్రతిని కూడా హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా కూడా అన్ని రకాల అధ్యయనాలను విశ్లేషించి, భారత్‌లో డెల్టా వేరియెంట్‌పై ఎలా పని చేస్తోందో శాస్త్రీయపరమైన డేటా పరిశీలించాక ఈ సిఫారసులు చేశామని అన్నారు. తమ కమిటీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు. రెండు డోసుల మధ్య వ్యవధి ఎందుకు? మొదటి టీకా డోసు తీసుకున్నాక శరీరంలో కరోనా వైరస్‌ని తట్టుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రెండో డోసు బూస్టర్ డోసు లాంటిది. 12 వారాల తర్వాత రెండో డోసు ఇస్తే వ్యాక్సిన్ సామర్థ్యం మరింత పెరుగుతుందని ఏప్రిల్‌లో పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వెల్లడించింది. బ్రిటన్‌లోని డోసుల మధ్య 12 వారాలు పెంచిన తర్వాతే ఆల్ఫా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. స్పెయిన్ (60 ఏళ్ల లోపు వారికి), కెనడా, శ్రీలంక దేశాల్లో కూడా 12–16 వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇస్తున్నారు. యూరోప్‌లో ఈ గడువు 4–12 వారాలుగా ఉంది. వివాదం ఎందుకు మొదలైంది? కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య 42 రోజుల కనిష్ట వ్యవధిని 84 రోజులకి ఒకేసారి పెంచుతూ మే 13న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) వివిధ అధ్యయనాలను పరిశీలించాక 12–16 వారాల వ్యవధి ఉంటే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయన్న సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో ఒక్కసారిగా టీకా డోసులకి కొరత ఏర్పడింది. వ్యాక్సిన్కున్న డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం వ్యాక్సిన్ గడువుని పెంచిందన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా ఎన్టీఏజీఐలో అత్యంత కీలకమైన 14 మంది సభ్యుల్లో ముగ్గురు శాస్త్రవేత్తలు రాయిటర్స్ సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి తాము గడువు రెట్టింపు చేయాలని సిఫారసు చేయలేదని చెప్పారు. కేంద్రమే ఆ నిర్ణయం తీసుకుందని మాథ్యూ వర్ఘీస్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. దీంతో వివాదం మొదలై వ్యాక్సిన్ గడువు వ్యవధిని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోవిడ్–19లో మార్పులు వస్తున్నట్టే దాని వ్యాక్సిన్ నిరంతరాయంగా మారే ప్రక్రియ. ఒకవేళ రెండో డోసుల వ్యవధిని తగ్గిస్తే ప్రజలకి 5–10% లబ్ధి జరుగుతుందని శాస్త్రీయంగా ఆధారాలు లభిస్తే తప్పకుండా వ్యవధి తగ్గించాలని సిఫారసు చేస్తాం. ప్రస్తుత 12–16 వారాల వ్యవధితోనే మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబితే ఇదే కొనసాగుతుంది ఎన్.కె. అరోరా, నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ గ్రూప్ చైర్మన్ -
‘పీఎం, సీఎంలకూ పరిమితి విధించాలి’
భోపాల్: ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను ఒకే వ్యక్తి ఎన్ని పర్యాయాలు చేపట్టవచ్చుననే దానిపై పరిమితి విధించాలని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్ చేశారు. అమెరికా వంటి దేశాల్లో ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదనే నిబంధన ఉంది. శనివారం ఆయన భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిటైరయ్యే ఉన్నతాధికారుల పదవీకాలం పొడిగిస్తుండటంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రిటైరయ్యే అధికారి, ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న వారికి పదవిని అప్పగించి వెళ్లిపోవాలని తెలిపారు. -
‘తక్కువ సమయం’ సహేతుకమే
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పును న్యాయ నిపుణులు స్వాగతించారు. ప్రొటెం స్పీకర్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు సహేతుకం, సమర్థనీయమైనవి, దీంతో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై అనుమానాలు నివృత్తి అవుతాయని సీనియర్ లాయర్లు రాకేశ్ ద్వివేది, అజిత్ సిన్హా, వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు. బలపరీక్షకు కోర్టు కాల పరిమితి విధించడంలో తప్పు లేదని అజిత్ అన్నారు. ప్రమాణ స్వీకారాన్ని కోర్టు వాయిదా వేసి ఉండాల్సిందన్న వికాస్..బలపరీక్షకు తక్కువ సమయం ఇవ్వడం సబబేనన్నారు. ‘బలపరీక్షకు తక్కువ సమయం ఇవ్వడం సమంజసమే. గోవా, ఉత్తరాఖండ్‌లో ఇలాగే జరిగింది. ఆలస్యం చేస్తే ఎమ్మెల్యేలు ఫిరాయించే ముప్పుంది. ఇప్పటికే రెండ్రోజులు లేటైంది’ అని ద్వివేది అన్నారు. ద్వివేదితో అజిత్ ఏకీభవించారు. బలపరీక్షకు ఎక్కువ సమయం ఇస్తే ఎమ్మెల్యేల కొనుగోళ్ల పందేరానికి తెరతీసినట్లవుతుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై స్పందిస్తూ..ఆ నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్దే అని ద్వివేది అన్నారు. -
తాజ్ సందర్శకులకు టైమ్ లిమిట్
ఆగ్రా : తాజ్ మహల్ సందర్శకులకు ఇక నుంచి టైమ్ పరిమితిని విధించనున్నారు. రద్దీని, కాలుష్య సమస్యను అరికట్టడానికి ఇక నుంచి తాజ్ మహల్ వద్ద కేవలం మూడు గంటలు మాత్రమే పర్యాటకులు గడిపేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) పరిమితి విధించబోతోంది. ఈ మేరకు ఏఎస్ఐ ఓ నోటీసును జారీచేసింది. ఆదివారం(ఏప్రిల్ 1) నుంచి ఈ కొత్త సిస్టమ్ అమల్లోకి రానుందని తెలిపింది. ఇప్పటి వరకు సందర్శకులు సాయంత్రం ఆ ప్రేమ మందిరం మూసే వరకు అక్కడ గడిపే సమయం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సిస్టమ్‌ను తీసేయనున్నారు. ‘హ్యుమన్ పొల్యూషన్’పై ఇప్పటికే పలు రిపోర్టులు హెచ్చరిస్తూ వచ్చాయి. తాజ్ వద్ద గడిపే సమయంపై పరిమితి విధిస్తేనే ఈ సమస్యను పరిష్కరించవచ్చని పలువురు నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే. వీకెండ్లలో, సెలవుల్లో ఈ ప్రేమ మందిరాన్ని సందర్శించడానికి 50వేల మందికి పైగా సందర్శిస్తూ ఉంటారు. అయితే ఎంతమంది పిల్లలు సందర్శిస్తారో ఇక రికార్డులు లేవు. 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి ఈ తాజ్ మహల్ సందర్శన ఉచితం. దీంతో హ్యుమన్ కాలుష్యం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టైమ్ పరిమితిని ఏఎస్ఐ తీసుకురాబోతోంది. కొత్త సిస్టమ్ ప్రకారం టైమ్ పరిమితి దాటి తాజ్ వద్ద ఎవరైనా ఎక్కువ సమయం వెచ్చిస్తే, అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఏఎస్ఐ అధికారులు చెప్పారు. -
రైల్వే నియామక ప్రక్రియ సమయం తగ్గింపు
న్యూఢిల్లీ: రైల్వే నియామక ప్రక్రియను రెండేళ్ల నుంచి 6 నెలలకు తగ్గించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేపట్టింది. గత నెల 24న వాస్కో–డి–గామా–పట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన అనంతరం రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ల సమావేశం జరిగింది. ‘రైల్వే ఉద్యోగాల ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగం రావడానికి అభ్యర్థులకు కనీసం రెండేళ్లు పడుతుంది. దీంతో అనేకమంది వేరే ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం ద్వారా నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ చాహాతే రామ్ ప్రతిపాదన చేశారు. దీంతో ఆరు నెలల్లోపు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు తమ అభిప్రాయాన్ని డిసెంబర్ 20లోగా తెలియజేయాలని లోహాని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును కోరారు. -
వాయిదా భారమెంతో తెలుసా?
పొదుపు విషయంలో కాలపరిమితి అనేది చాలా విలువైనది. ఎంత తొందరగా పొదుపు మొదలు పెడితే అంత తక్కువ మొత్తంతో ఎక్కువ లాభాలను పొందొచ్చు. అలా కాకుండా ఆలస్యం అయ్యే కొద్ది పొదుపు వ్యయం పెరుగుతుంది. చిన్న తనంలోనే పొదుపు చేయడం ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఏగాన్ రెలిగేర్ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యతీష్ శ్రీవాత్సవ ఏమంటున్నారో చూద్దాం... ఎంబీఏ పూర్తి చేసిన సుమీత్ (23) హైదరాబాద్ మల్టీ నేషనల్ కంపెనీలో చేరాడు. ఇతని నెల జీతం రూ.30,000. తండ్రి ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగి, సొంతింటిలోనే మకాం ఉండటంతో సుమీత్కు ఎటువంటి బాదరబందీలు లేవు. ఇప్పటి యువతరం లాగానే జీతాన్ని అంతా కొత్త కొత్త ఫ్యాషన్ దుస్తులు, గాడ్జెట్స్, ఇతర విలాసాలకు ఖర్చు చేస్తున్నాడు. కాని తన భవిష్యత్తు ఆర్థిక భద్రత, దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై అవగాహన లేదు. ఇలాంటి సుమీతులు మనకు దేశవ్యాప్తంగా లక్షల్లో కనిపిస్తుంటారు. దీనికంతటికీ కారణం వారికి ఎటువంటి ఆర్థిక బాధ్యతలు లేకపోవడం, పొదుపుపై అవగాహన లేకపోవడమే. కాని సుమీత్ లాంటి వారు చిన్నతనంలోనే పొదుపు చేయడం ప్రారంభించకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నారో అర్థం చేసుకోవటం లేదు. ఉదాహరణకు బీమా విషయానికి వస్తే ఇక్కడ ప్రీమియంలు అనేవి వయసుతో ఆధారపడి ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం పెరిగిపోతుంది. సుమీత్ 23 ఏట కాకుండా 30 ఏళ్లప్పుడు రూ. 50 లక్షలకు బీమా పాలసీ తీసుకుంటే 26 శాతం అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అతను 75 ఏళ్లు వచ్చే వరకు అదనపు ప్రీమియం చెల్లిస్తూనే ఉండాలి. అంతేకాదు రూ. 50 లక్షల బీమాకు అతను చెల్లించే ప్రీమియం విలువ ఎంతో తెలుసా?... తన వార్షిక జీతంలో ఒక శాతం కూడా ఉండదు. ఇది అతని కొత్త ఫోన్ ఖరీదు కంటే తక్కువ. కాబట్టి సుమీత్ లాంటి వాళ్లు ఆర్థిక ఇబ్బందులు లేవు కాబట్టి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా, ఇదే సమయంలో భవిష్యత్తు ఆర్థిక భద్రత విషయంలో మాత్రం అలసత్వం వహించకూడదు.