యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సోమవారం గంటపాటు మూసివేశారు.
యాదగిరికొండ(నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సోమవారం గంటపాటు మూసివేశారు. విష్ణుపుష్కరిణిలో పడి హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన దుద్దెడ రాజు అనే భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో ఆలయ అర్చకులు నిత్య కైంకర్యాలన్ని నిలిపి వేసి గంటపాటు ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఉత్సవమూర్తులకు తిరుమంజనం చేశారు. నిత్య కైంకర్యాలను నిర్వహించి తిరిగి తెరిచారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు.