temple priest
-
ప్రియురాలిని చంపి ఉప్పు పాతరేశాడు!
శంషాబాద్, చైతన్యపురి, హుడా కాంప్లెక్స్: గుడికి వచ్చిన యువతితో వివాహితుడైన పూజారికి ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు బాగానే గడిపారు. తీరా తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం నగర శివార్లలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని సరూర్‌నగర్ మండల ఆఫీసు వెనుక ఉన్న పాత సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి ఉప్పు, ఎర్రమట్టి నింపాడు. వాసన బయటకు రాకుండా దానికి ఉన్న రెండు మ్యాన్‌హోల్స్‌కు కాంక్రీట్ చేశాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గుడిలో ఏర్పడిన పరిచయం కాస్తా .. చెన్నైకి చెందిన కురుగంటి అరుణ, శ్రీకర్ దంపతుల కుమార్తె అప్సర (30) అక్కడే సినీ రంగంలో పని చేశారు. ఓ చిత్రంలో పాత్ర కూడా పోషించారు. తండ్రి కాశీకి వెళ్లిపోవడంతో కూతురును తీసుకొని తల్లి హైదరాబాద్‌కు వలస వచ్చింది. వీళ్లు సరూర్‌నగర్ వెంకటేశ్వరకాలనీ రోడ్ నం.15 లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. స్వతహాగా భక్తురాలైన అప్సర తరచూ తన ఇంటికి సమీపంలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లేది. ఈ క్రమంలో ఆలయ ప్రధాన పూజారి, రియల్టర్ అయిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణతో గతేడాది ఏప్రిల్‌లో పరిచయమైంది. ఇరువురిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఓ పాపకు తండ్రి కూడా అయిన సాయికృష్ణ తరచు అప్సర ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఆమెను తీసుకుని తన ద్విచక్ర వాహనం, కార్లలో గోశాలలు, దేవాలయాలకు వెళ్తుండేవాడు. ఎలాంటి సందేహం రాని అరుణ వారికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో... సాయికృష్ణతో సన్నిహితంగా మెలుగుతున్న అప్సర గతంలో పలుమార్లు తనను రెండో వివాహం చేసుకోవాల్సిందిగా కోరింది. అతడు దాటవేస్తుండటంతో ఈ ఏడాది మార్చి నుంచి ఒత్తిడి పెంచింది. దీంతో ఆమెను హత్య చేయాలనే నిర్ణయానికొచ్చిన సాయికృష్ణ.. ఈ నెల 3వ తేదీ రాత్రి 8.15 గంటల ప్రాంతంలో తన కారులో (ఫోర్డ్ ఫిగో, టీఎస్ 07హెచ్‌జే 2172) అప్సర ఇంటికి వెళ్లాడు. కోయంబత్తూరు వెళ్దామని చెప్పి బయటకు తీసుకొచ్చాడు. 11 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలో భోజనం చేశారు. తర్వాత కాస్త అస్వస్థతకు గురైన అప్సర కారు ముందు సీట్లో నిద్రకు ఉపక్రమించింది. సాయికృష్ణ అక్కడినుంచి సుల్తాన్పూర్ గోశాల వైపు కారు తీసుకెళ్లాడు. కారు బాడీ కవర్‌తో చంపేందుకు విఫలయత్నం... తెల్లవారుజామున 3.50 గంటలకు అప్సర నిద్రలో ఉండగా.. కారు బాడీ కవర్ బయటకు తీసిన సాయికృష్ణ వెనుక సీటులోకి వచ్చాడు. అక్కడ నుంచే బాడీ కవర్‌ను ఆమె మెడకు చుట్టి, ఊపిరి ఆడకుండా చేసి చంపాలని ప్రయత్నించాడు. కానీ అప్సర ప్రతిఘటించడంతో వెనుక సీటు కింద ముందే ఉంచిన బెల్లం కొట్టే రాయి తీసి దాదాపు పదిసార్లు కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని అదే కవర్లో చుట్టిన సాయికృష్ణ కారు డిక్కీలో పెట్టి మరుసటి రోజు (ఈ నెల 4న) తెల్లవారుజామున 4:45 గంటలకు సరూర్‌నగర్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు చేరుకుని కారును మృతదేహంతో పాటే పార్కింగ్‌లో ఉంచాడు. ఉదయం అరుణ ఇంటికి వెళ్లిన సాయికృష్ణ అప్సర తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని నమ్మించాడు. తర్వాత అప్సర ఆచూకీ తెలియడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పి, ఈ నెల 5వ తేదీన అరుణతో కలిసి ఆర్జీఐఏ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అప్సరను తన మేనకోడలిగా పేర్కొన్నాడు. భద్రాచలం వెళ్తానని చెప్పడంతో తన కారులోనే శంషాబాద్ వరకు తీసుకువచ్చి అక్కడి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె ఫ్రెండ్స్ కారులో ఎక్కించానని, మరుసటి రోజు నుంచి ఆమె ఫో¯న్ స్విచ్చాఫ్ వస్తోందని తెలిపాడు. మృతదేహం నుంచి వాసన వస్తుండటంతో... అప్సర మృతదేహం 5వ తేదీ సాయంత్రం వరకు సాయికృష్ణ కారులోనే ఉంది. దుర్వాసన వస్తున్నట్టు గమనించిన అతను రాత్రి వేళ కారు తీసుకుని సరూర్‌నగర్ తహశీల్దార్ కార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వినియోగంలేని సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని గన్నీ బ్యాగ్‌లో కుక్కి పడేసి, దాదాపు 2 బస్తాల ఉప్పు దానిపై పోశాడు. నిత్యాన్నదానం చేస్తున్న ఇతను దానికి వా డే ఉప్పునే దీనికీ ఉపయోగించాడు. మరుసటి రో జు తెల్లవారుజామున 2 టిప్పర్ల ఎర్రమట్టి తెప్పించి సెప్టిక్ ట్యాంక్‌లో పోయించాడు. ఆమె హ్యాండ్ బ్యా గ్, లగేజీ బ్యాగ్ కాల్చేశాడు. ఇంటికి వెళ్లి కారును శుభ్రం చేసి దాచిపెట్టాడు. ఈ నెల 7న మరోసారి అక్కడకు వెళ్లిన సాయికృష్ణ సెప్టిక్ ట్యాంక్‌కు ఉన్న రెండు మ్యాన్‌హోల్స్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించాడు. దీంతో ఎల్బీనగర్ లోని లేబర్ అడ్డాకు వెళ్లి కొత్త మ్యాన్‌హోల్ మూతలు తెచ్చాడు. వీటిని మ్యాన్‌హోల్స్‌పై ఉంచి కాంక్రీట్ పోశాడు. ఆ సమీపంలో ఓ బోరు కూడా వేయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ స్థలాన్ని బాగు చేయించాడు. ఇదంతా సామాజిక సేవలో భాగమనే భావన స్థానికులకు కల్పించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు అప్సర ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. శంషాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీలు, అప్సర, సాయికృష్ణ ఫోన్ల టవర్ లొకేషన్లు తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీలో సాయికృష్ణ కారులోనే అప్సర షాబాద్ రోడ్డు మీదుగా నర్కూడ వైపు వెళ్లినట్లు కనిపించింది. దీంతో పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడు. శుక్రవారం ఆర్జీఐఏ పోలీసులు సెప్టిక్ ట్యాంక్‌ను పగులగొట్టి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న అప్సర మృతదేహాన్ని బయటకు తీశారు. సాయికృష్ణను అరెస్టు చేసి కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ కె.నారాయణరెడ్డి శుక్రవారం ప్రకటించారు. హత్య జరిగిన ప్రాంతం శంషాబాద్ గ్రామీణ పోలీసుస్టేషన్పరిధిలోకి వస్తుంది. దీంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి ఆ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేయనున్నారు. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేయడంతోనే అప్సరను చంపానని సాయికృష్ణ పోలీసు విచారణలో చెప్పినట్లు తెలిసింది. అప్సర గతంలోనూ గర్భం దాల్చిందని, దీంతో తనను పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పినట్లు తెలిసింది. తన వల్లే అప్సర గర్భం దాల్చలేదని, ఆమెకు ఇతరులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నట్లు సమాచారం. గతంలో ఆమెకు తానే అబార్షన్ చేయించానని చెప్పాడని తెలుస్తోంది. మా అబ్బాయి మంచివాడు మా అబ్బాయి సాయికృష్ణ చాలా మంచివాడు. దైవసేవ తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అప్సర చనువుగా ఉండటం గమనించి ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పాం. మా అబ్బాయే హత్య చేశాడని అనుకోవటం లేదు. – నిందితుడి తండ్రి లక్ష్మినర్సింహమూర్తి సాయికృష్ణను ఉరితీయాలి అక్కయ్యా అని పిలుస్తూ మా ఇంటికి వచ్చేవాడు. అభం శుభం తెలియని నా బిడ్డకు మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. చివరకు పొట్టన పెట్టుకున్నాడు. వాడిని బహిరంగంగా ఉరి తీయాలి. – అప్సర తల్లి అరుణ ఇంత కర్కోటకుడు అనుకోలేదు సాయికృష్ణ గత పదేళ్లుగా సరూర్‌నగర్ పరిసరాల్లోని ఆలయాల్లోనే పని చేస్తున్నాడు. అందరికీ సుపరిచితుడు. నమ్మకంగా ఉండటంతో ఆలయం ప్రధాన పూజారిగా నియమించాం. కానీ ఇంత కర్కోటకుడు అనుకోలేదు. – ఆకుల అరవింద్‌కుమార్, ట్రస్టీ, బంగారు మైసమ్మ దేవాలయం -
కుంభమేళాకు వెళ్లొచ్చిన పూజారి కరోనాతో మృతి
వైఎస్సార్ కడప: దేశంలో కరోనా విశృంఖలంగా వ్యాపించడానికి ప్రధాన కారణం కుంభమేళా అని కూడా అందరూ ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పక్కన పెడితే కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారికి మాత్రం పెద్ద సంఖ్యలో కరోనా వ్యాప్తి చెందింది. తాజాగా కుంభమేళాకు వెళ్లివచ్చిన పూజారి కరోనా సోకి మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఆలయ ప్రధాన అర్చకులు కరోనాతో మృతిచెందారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అమ్మవారిశాల ప్రధాన అర్చకుడు అనంతబోట్ల హరికృష్ణ శర్మ ఇటీవల హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వచ్చిన అనంతరం ఆయనకు కరోనా సోకింది. వారం రోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందారని వారి బంధువులు వెల్లడించారు. ఈ విధంగా కుంభమేళాకు వెళ్లి వచ్చిన చాలా మంది కరోనా బారినపడ్డారని తెలుస్తోంది. చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
ఆలయ పూజారి దారుణ హత్య
జైపూర్: రాజస్తాన్‌లో ఆలయ భూముల కబ్జాను అడ్డుకుంటున్న ఓ పూజారిని దారు ణంగా హత్య చేసిన ఘటన బుధవారం జరిగింది. కరౌలీ జిల్లాలోని బుక్నా గ్రామంలో ఆలయ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. ఆలయ పూజారి బాబూలాల్ వైష్ణవ్ ఎప్పటికప్పుడు దాన్ని అడ్డుకునేవారు. ఆయన ఉంటే తమ ఆటలు సాగవనే కక్షతో కబ్జాదారులు పూజారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన పూజారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ చెప్పారు. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేశామన్నారు. ఆలయ పూజారి హత్యకు గురికావడం దురదృష్టకరమని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. పూజారి హత్యోదంతంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాజస్తాన్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూర్ణియా విమర్శించారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో నేరగాళ్లు చెలరేగిపోతున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ రాజకీయ పర్యటనలు చేయడం బదులు రాజస్తాన్‌లో జరుగుతున్న ఘోరాలపై అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో దారుణంగా విఫలమైందని జవదేకర్ విమర్శించారు. పూజారి ప్రాణాలను బలిగొన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాజా ఘటనపై బీజేపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. -
దశాబ్దాల కల సాకారం ..అర్చక కుటుంబాల్లో ఆనందం..!
అర్చకుల కుటుంబాల్లో ఆనంద దీపావళి ముందే వచ్చింది. దశాబ్దాలుగా పట్టించుకోని వారి కల ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చారు. దేశంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ధూపదీప నైవేధ్య పథకం తెచ్చి ఆలయాల ఉన్నతికి కృషి చేసిన ఘన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రకెక్కితే, వేలాది అర్చకులకు తీరని కలగా ఉన్న వంశ పారంపర్య హక్కును భుక్తం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి మరో ఘన చరిత్రకు ఆయన తనయుడు దారులు వేశారు. తద్వారా పలు అర్చకుల సంఘాల ఆనందం వ్యక్తం చేస్తూ తండ్రీ బిడ్డలకు కతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సాక్షి, ఒంగోలు : దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేస్తూ తరాలుగా పొట్ట పోసుకుంటున్న వేలాది అర్చకుల వంశ పారంపర్య హక్కును 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు చేశారు. దరమిలా తర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి అర్చకుల కష్టాలను తెలుసుకుని రద్దు చేసిన చట్టానికి 2007లో 34/3 పేరుతో చట్టాన్ని సవరిస్తూ అర్చుకులకు వంశ పారంపర్య హక్కుల పూర్వోధ్ధరణ కోసం ఉత్తర్వులు తెచ్చారు. త్వరలో అర్చకుల సంక్షేమం కోసం ఉత్తర్వులు ఇవ్వాలనుకునే లోపు మత్యువు వారిని కబళించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వారు ఈ సవరణ ఉత్తర్వులను తొక్కిపెట్టారు. వంశ పారంపర్య హక్కులు కలిగివున్న అర్చకులకు కన్నీళ్లను వారు పట్టించుకోలేదు. 2017లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి, నెల రోజుల్లో చర్యలు చేపడతామని బుకాయిస్తూ అర్చకుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. మూడేళ్లు గడిచినా, ఎన్నిసార్లు అర్చకులు విన్నవించుకున్నా గత ప్రభుత్వం అర్చకుల విజ్ఞాపనలను కనీసంగా కూడా పట్టించుకోలేదు. అర్హులైన అర్చకులు, అర్చక సంఘాలు అప్పటి నుంచీ పోరాడుతూనే ఉన్నారు ఇందుకు సంబంధించి 2017లో పరిశీలిస్తామని జీవో నంబర్ 2 పేరుతో ఉత్తర్వులు ఇచ్చి, నెల్లాళ్లలో పరిశీలిస్తామని చెప్పిన గత ప్రభుత్వం అర్చకుల న్యాయమైన హక్కులకు జెల్ల కొట్టింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ మీద నెల రోజుల్లో స్పందిస్తానన్న గత ముఖ్యమంత్రి అర్చకులను మోసం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2007లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో చేసిన చట్ట సవరణకు మరింతగా మెరుగులు దిద్ది, అర్చక సంక్షేమం, దేవాలయాల ఉన్నతిని కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్సింగ్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో జిల్లాలో దాదాపు 90 శాతం ఆలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్న వేలాది అర్చకులకు లబ్ది చేకూరనున్నది. ఈ ఉత్తర్వుల ప్రకారం దేవదాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఆలయాలను మినహాయించి వంశపారంపర్యంగా హిందూ దేవాలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్న వంశపారంపర్య అర్చకులు, మిరాశీదార్లకు లబ్ది చేకూరనున్నది. హింధూ ధర్మానికి చెందిన సంస్థల్లో 1987లో రద్దు చేసిన హక్కులను తిరిగి ఇప్పుడు సాకారం చేశారు. 1966 నుంచి వస్తున్న అర్చక వంశపారంపర్య హక్కును 1987లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోల్పోయిన హక్కును తాత్కాలికంగా 2007లో పొందారు. దరిమిలా ఇప్పుడు సంపూర్ణ హక్కులను ఈ ఉత్తర్వు ద్వారా పొందనున్నారు. బ్రాహ్మణ సేవా సమితి హర్షం అర్చక, పురోహితుల హితం కోరుతూ అర్చకుల వారసత్వ హక్కును పునరుద్ధరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయటం ఎంతో అభినందనీయమని బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు సివిఎల్.సుబ్రహ్మణ్యం, గంజాం శ్రీరంగనాథ ప్రసాదులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల అర్చకుల మనోభావాలు బలపడ్డాయని, చిన్నతరహా దేవాలయాల అర్చకులకు ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంక్షేమ సమితి కార్యవర్గ సభ్యులు మైనంపాటి సాయికుమార్, భీమశంకర శాస్త్రి, ఎంవి. శేషయ్య, శివకుమార్, వ్యామిజాల ప్రసన్నకుమార్, హరిప్రేమనా«థ్లు పేర్కొన్నారు. అర్చక కుటుంబాలు రుణపడి ఉంటాయి.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది అర్చక కుటుంబాలు సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాయి. వారి తండ్రి దివంగత రాజశేఖరరెడ్డి దేవాలయాల ఉన్నతి కోసం దేశంలోనే తొలిసారి ధూపదీప నైవేద్య పధకం ప్రవేశపెట్టి చరిత్ర సృష్టిస్తే, ఆ మహనీయుని కుమారుడిగా జగన్ అర్చకుల సంక్షేమం కోసం వంశ పారంపర్య చట్టానికి మోక్షం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. – ఎం.ఏ శేషాచార్యులు, ప్రధాన కార్యదర్శి, అర్చక సంక్షేమ సంఘం బ్రాహ్మణ జాతి రుణపడి ఉంటుంది.. సీఎం జగన్మోహనరెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అర్చకుల కష్టాలను, జీతాలు లేక అల్లాడిపోతున్న తీరును పాదయాత్రలో జగన్ దృష్టికి తీసుకువెళ్లాం. దీనిని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి గత టీటీడీ ప్రభుత్వం చేయలేని పనిని ఈయన చేసి చూపించారు. బ్రాహ్మణుల సమస్యలపై డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దృష్టికి తీసుకెళ్లాం. వంశపారంపర్య హక్కుల కొనసాగింపు, కనీస వేతనాల పెంపు, దూపదీప నైవేద్యం కింద రూ.5వేలు, ఆరుసి దేవస్థానంలో రూ.10 వేల నుంచి 16 వేలకు జీతాలు పెంపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల విడుదల చేయడం అభినందనీయం. యావత్ బ్రాహ్మణ జాతి జగన్మోహనరెడ్డికి ఋణపడి ఉంటుంది. – పలుకూరి సుబ్బారావు, అర్చక సంఘం రాష్ట్ర కార్యదర్శి -
జంతు విడిభాగాలతో వ్యాపారం.. పూజారి అరెస్ట్
కర్గోన్(మధ్యప్రదేశ్) : వన్యప్రాణులను వధించి వాటి విడిభాగాలతో వ్యాపారం చేస్తున్న ఓ పూజారిని అధికారులు వల పన్ని పట్టుకున్నారు. మధ్య ప్రదేశ్‌లో కర్గోన్లోని ఓ దేవాలయంలో పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేశ్ జాగిర్దార్ను ఢిల్లీ నుంచి వచ్చిన వైల్డ్ లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో (డబ్య్లూసీసీబీ), ఎస్టీఎఫ్, ఫారెస్ట్ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. సంప్రదాయ పద్దతుల్లో వన్యప్రాణుల శరీరాల నుంచి ఔషదాలు, చేతబడి పద్దతులతో అదృష్ట ఆభరణాలను లోకేశ్ జాగిర్దార్ తయారు చేసి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేవాడు. అదృష్ట ఆభరణాలు ధరిస్తే.. మీ తలరాత మారిపోతుంది, అదృష్టం మీవెంటే ఉంటుంది అంటూ హామీలు గుప్పించి, వినియోగదారులకు తన ఉత్పత్తులను అమ్మి సొమ్ము చేసుకునే వాడని అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా తాను తయారు చేసిన ఉత్పత్తులను అమెరికా, మలేషియా, జర్మనీ, ఆస్ట్రేలియాలతో పాటూ మరిన్ని దేశాల్లో అమ్మేవాడని ఫారెస్ట్ అధికారి కే సోలంకి చెప్పారు. వన్యప్రాణుల భాగాలు, అతను తయారు చేసిన ఔషదాలు, అదృష్ట ఆభరాణాలను అధికారులు సీజ్ చేశారు.1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్లకింద లోకేశ్ జాగిర్దార్పై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. -
యువతిని రేప్ చేసిన ఆలయ పూజారి!
మంగళూరు: కర్ణాటక మంగళూరులోని ప్రముఖ కతీల్ దుర్గపరమేశ్వరి ఆలయంలో అసిస్టెంట్ పూజారిగా పనిచేస్తున్న హరిశ్చంద్రరావు (56)ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిపినట్టు హరిశ్చంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అత్యాచార ఘటన ఏడాది కిందట జరిగింది. దాంతో గర్భవతి అయిన బాధితురాలు తాజాగా అబార్షన్ కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగుచూసింది. 2015 ఆగస్టులో తన ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయిపై హరిశ్చంద్రరావు అలియాస్ అప్పు భట్టా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. అయితే తనకు ఉన్న పలుకుబడితో పూజారి ఈ ఘటనను వెలుగులోకి రాకుండా చూశాడు. స్థానిక పెద్దలతో పరిష్కారం జరిపించి.. బాధితురాలికి పరిహారంగా కొంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే మొదట బాధితురాలు అబార్షన్ చేయించుకోవడానికి నిరాకరిచింది. గత నవంబర్‌లో ఆమె అబార్షన్ కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు అబార్షన్‌కు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు అప్పు భట్టా ప్రయత్నించాడు. దీంతో వారు ఈ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలు కూడా తాజాగా బాజ్పే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పు భట్టాను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. -
గుట్ట ఆలయం గంటపాటు మూసివేత
యాదగిరికొండ(నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సోమవారం గంటపాటు మూసివేశారు. విష్ణుపుష్కరిణిలో పడి హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన దుద్దెడ రాజు అనే భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆలయ అర్చకులు నిత్య కైంకర్యాలన్ని నిలిపి వేసి గంటపాటు ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఉత్సవమూర్తులకు తిరుమంజనం చేశారు. నిత్య కైంకర్యాలను నిర్వహించి తిరిగి తెరిచారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. -
బాలికపై పూజారి అత్యాచారం.. హత్య
పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ప్రసాదం ఇస్తానని చెప్పి ఆశపెట్టి తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ ఆలయ పూజారి అత్యాచారం చేసి, తర్వాత ఆమెను పీకపిసికి చంపేశాడు! బర్ద్వాన్ జిల్లాలో జరిగిన ఈ కేసులో పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. రెండోతరగతి చదువుతున్న ఆ బాలిక ఆలయ ప్రాంగణంలో పూలు కోసుకోడానికి వచ్చింది. సౌత్ బజార్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి ధర్మకర్తగా కూడా ఉన్న ఆ పూజారి ఆ చిన్నారిని ఆలయం పైభాగంలోకి తీసుకెళ్లి అక్కడే అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. తర్వాత ఆమెను పీకపిసికి చంపి.. కిందకు తోసేశాడు. ఏదో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు పరుగున అక్కడకు రాగా, అప్పటికే ఒంటినిండా తీవ్రగాయాలున్న బాలిక మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు తెలియజేయడంతో అసాసోల్-దుర్గాపూర్ కమిషనర్ వినీత్ గోయల్, ఏసీపీ పంకజ్ ద్వివేది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో పూజారితో పాటు ఓ కూరగాయల వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు గోయల్ తెలిపారు.