యువతిని రేప్ చేసిన ఆలయ పూజారి! | Mangaluru temple priest rapes teenage girl, arrested | Sakshi
Sakshi News home page

యువతిని రేప్ చేసిన ఆలయ పూజారి!

Published Mon, Feb 8 2016 3:08 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

యువతిని రేప్ చేసిన ఆలయ పూజారి! - Sakshi

యువతిని రేప్ చేసిన ఆలయ పూజారి!

మంగళూరు: కర్ణాటక మంగళూరులోని ప్రముఖ కతీల్ దుర్గపరమేశ్వరి ఆలయంలో అసిస్టెంట్ పూజారిగా పనిచేస్తున్న హరిశ్చంద్రరావు (56)ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిపినట్టు హరిశ్చంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అత్యాచార ఘటన ఏడాది కిందట జరిగింది. దాంతో గర్భవతి అయిన బాధితురాలు తాజాగా అబార్షన్ కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

2015 ఆగస్టులో తన ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయిపై హరిశ్చంద్రరావు అలియాస్ అప్పు భట్టా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. అయితే తనకు ఉన్న పలుకుబడితో పూజారి ఈ ఘటనను వెలుగులోకి రాకుండా చూశాడు. స్థానిక పెద్దలతో పరిష్కారం జరిపించి.. బాధితురాలికి పరిహారంగా కొంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే మొదట బాధితురాలు అబార్షన్ చేయించుకోవడానికి నిరాకరిచింది. గత నవంబర్‌లో ఆమె అబార్షన్ కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు అబార్షన్‌కు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు అప్పు భట్టా ప్రయత్నించాడు. దీంతో వారు ఈ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలు కూడా తాజాగా బాజ్పే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పు భట్టాను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement