ఆ థియేటర్లలో బొమ్మ పడదు | Telangana single screen theatres to shut down for 10 days due to low footfalls | Sakshi
Sakshi News home page

ఆ థియేటర్లలో బొమ్మ పడదు

Published Fri, May 17 2024 5:21 AM | Last Updated on Fri, May 17 2024 7:43 AM

Telangana single screen theatres to shut down for 10 days due to low footfalls

నేటి నుంచి మూతపడనున్న సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు

రాష్ట్రంలో దాదాపు 350పైనే..

సాక్షి, హైదరాబాద్‌: థియేటర్ల మూసివేత విషయం ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌ సమష్టి నిర్ణయం కాదని... నష్టాలను మూటకట్టుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమాలు వచ్చేవరకు అంటే...శుక్రవారం నుంచి కనీసం పదిరోజులపాటు ఏ బొమ్మా పడదు. జనవరి తర్వాత జూన్‌ వరకు పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడు­దల కావడం లేదని, చిన్న సినిమాలు వచ్చినా.. అవి ప్రేక్షక ఆదరణ లేని కారణంగా రోజు అయ్యే వ్యయంలో కనీసం పదిశాతం ఆదాయం కూడా రావడం లేదని ఎగ్జిబిటర్‌ చారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. 

మల్టీప్లెక్స్‌లకు పర్సెంటేజీ రూపంలో లాభాలు  
సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా మల్టీప్లెక్స్‌లకు ఒక విధంగా, సింగిల్‌ థియేటర్లను మరోలా చూస్తున్నార­న్న వాదన కూడా ఎగ్జిబిటర్ల నుంచి వినిపిస్తోంది. మల్టీప్లెక్స్‌లో ఒక సినిమా వారంరోజులు నడిస్తే..వచ్చే ఆదాయంపై పర్సెంటేజీ రూపంలో లాభాలు ఇ­స్తుంటే.. సింగిల్‌ థియేటర్లకు అయితే కేవలం అద్దె ప్రాతిపదికన డబ్బు చెల్లిస్తున్నారని, అద్దె చెల్లించడానికి వచ్చే ఆదాయం కంటే తక్కువ కలెక్షన్లు వచి్చనప్పుడు పర్సెంటేజీ లెక్కన తీసుకోమంటున్నారని థి­యేటర్ల యజమానులు చెబుతున్నారు. పెద్ద హీ­రో­ల సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుం­డడంతో.. థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గుతోం­దని, దానికితోడు ఓటీటీల్లోనూ సినిమాలు వస్తుం­డడంతో.. థియేటర్లకు ఆదరణ తగ్గుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సు­దర్శన్‌ థియేటర్‌ యజమాని గోవింద్‌రాజు తెలిపారు.  

అది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం.. 
రెండువారాలపాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయంతో తెలంగాణ స్టేట్‌ ఫిలిం చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు సునీల్‌నారంగ్, కార్యదర్శి కె.అనుపమ్‌రెడ్డి స్పష్టం చేశారు.  

చిత్రసీమ అపెక్స్‌ బాడీకి నోటీసు ఇవ్వలేదు..
తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో థియేట­ర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయానికి చిత్ర పరిశ్రమ అపెక్స్‌బాడీలైన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలికి గాని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్‌ తెలిపారు. ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శనలు రద్దు చేయడమైందని గతంలోనూ బోర్డులు పెట్టేవారని ఆయన గుర్తు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement