బాలుర విభాగంలో విజేతలకు గోల్డ్‌మెడల్ అందజేస్తున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
Published Mon, Sep 19 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
పెనుబల్లి : స్థానిక సప్తపది ఫంక్షన్‌హాల్లో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కరాటే పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటేను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. పెనుబల్లి లాంటి మారుమూల ప్రాంతాల్లో కరాటేను ప్రజల్లోకి తీసుకెళ్లిన కరాటే మాస్టర్ శ్రీకాంత్‌ను ఆభినందించారు. మహిళల ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం తుదిపోరును తిలకించారు. అంతకుముందు ఈ పోటీలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కరాటే మాస్టర్లు, స్థానిక నాయకులు మట్టా దయానంద్ విజయ్‌కుమార్, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, చీకటి రామారావు, చెక్కిలాల మోహన్‌రావు, ముక్కర భూపాల్‌రెడ్డి, కీసర శ్రీనివాస రెడ్డి, పిల్లి నవజీవన్, అలుగోజు చినస్వామి పాల్గొన్నారు.
Advertisement