‘రాకెట్’వేగంతో ఆట
ఉత్కంఠగా బ్యాడ్మింటన్ టోర్నీ–నేడు ఫైనల్స్
బాలుర మ్యాచ్‌లు 173, బాలికల మ్యాచ్‌లు 79
ఆశలు రేకెత్తించిన జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారులు
అండర్–15 ఫైనల్‌కు ప్రవేశించిన సింగిల్స్, డబుల్స్‌లో పవన్కష్ణ జోడి
ఖమ్మం స్పోర్ట్స్: బ్యాడ్మింటన్ కోర్టులో అటూ ఇటూ వేగంగా కదులుతూ..ప్రత్యర్థి బ్యాట్‌తో కొట్టిన రాకెట్‌ను మిస్సవకుండా అవతలి కోర్డులోకి పంపేస్తూ..పాయింట్లు పెంచుకునేందుకు క్రీడాకారులు ఎంతో ఉత్సహంగా ఆడేస్తున్నారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్–13, 15 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజైన శుక్రవారం పోటీలు ఉత్కంఠగా సాగాయి. విద్యార్థులు సింగిల్స్, డబుల్స్‌లలో అద్భుత ప్రతిభను చూపి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. పోటీల్లో ఖమ్మంకు చెందిన టి.పవన్కష్ణ, బి.రితిన్లు చక్కని ఆటతీరును ప్రదర్శిచి ఫైనల్స్‌కు చేరుకొవడం విశేషం. అండర్–15 బాలుర సింగిల్స్ సెమీఫైనళ్లలో టి.పవన్కష్ణ–టి.వశీకష్ణపై 21–12, 21–13 తేడాతో అవలీలగా నెగ్గాడు. అండర్–15 బాలుర విభాగం డబుల్స్‌లో బి.రితిన్, టి.పవన్కష్ణ (ఖమ్మం)–బీవీ.ఉన్నిత్కష్ణ, ఎస్.సాయిపథ్వీ (హైదరాబాద్)పై 21–12, 21–08 తేడాతో నెగ్గి ఫైనల్స్‌లో స్థానం దక్కించుకున్నారు. అండర్–15 బాలికల డబుల్స్‌లో కె.భార్గవి (రంగారెడ్డి ) –శ్రీవిద్య (హైదరాబాద్) 21–12, 21–17 తేడాతో నెగ్గి సెమీఫైనల్స్‌కు, ఎం.మేఘానరెడ్డి–(హైదరాబాద్)– కె.అనూష(ఖమ్మం)పై 21–12, 21–10 తేడాతో నెగ్గి సెమీస్‌కు చేరారు. బాలుర అండర్–13విభాగంలో పి.సహాస్కుమార్(మెదక్)– ఎన్.అనిరు«ద్ (వరంగల్) పై 21–18, 21–17 తేడాతో గెలిచారు. మొత్తం బాలుర మ్యాచ్‌లు 173, బాలికల మ్యాచ్‌లు 79 జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు, క్రీడాభిమానులతో పటేల్ స్టేడియం ప్రాంగణం కళకళలాడింది. శనివారం ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు.
=====================
అండర్–13 బాల, బాలికల క్వార్టర్స్ఫైనల్ ఫలితాలు..
బాలుర విభాగంలో పోటీలు క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. పి.షాహాస్కుమార్(మెదక్)–టి.రుక్షేంద్ర(రంగారెడ్డి)పై 21–06, 15–21, 21–17, ఎన్.అనిరు«ద్(వరంగల్)–పి.వాయునందన్‌రెడ్డి(రంగారెడ్డి)పై 21–16, 21–16 తేడాతో, ఎం.శశాంక్సాయి(హైదరాబాద్)–జి.అభినయ్సాయిరాం(వరంగల్)పై 21–15, 21–15 పై గెలుపొందారు. సి.శ్రియ(రంగారెడ్డి)–ఎన్.శ్రీనిత్య(రంగారెడ్డి)పై 21–11, 21–09 తేడాతో, జి.పూజిత(రంగారెడ్డి)–డి.శ్రావ్య(హైదరాబాద్)పై 21–14, 21–15 తేడాతో, ఎం.మేఘానరెడ్డి(హైదరాబాద్)–జి.సంజన(రంగారెడ్డి)–21–14, 21–107 తేడాతో, కె.అశ్రిత(ఖమ్మం)–వి.శ్రేయంనింషీ(మెదక్) పై 21–07, 21–07 తేడాతో క్వార్టర్ ఫైనల్లో నెగ్గి సెమీస్‌కు చేరారు. సెమీస్‌లో ఎం.మేఘన రెడ్డి(హైదరాబాద్)–కె.అశ్రిత(ఖమ్మం)21–12, 21–10 తేడాతో గెలుపొందింది.
అండర్–15 ఫలితాలు..
అండర్–15 బాలుర క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న క్రీడాకారులు వీరే..: టి.పవన్కష్ణ(ఖమ్మం), బి.యశ్వంత్రామ్(హైదరాబాద్)21–14, 21–16 తేడాతో, టి.వంశీకష్ణ(రంగారెడ్డి)–పథ్వీకపూర్(హైదరాబాద్)పై 23–21, 17–21, 21––14 తేడాతో, బి.రితిన్(వరంగల్)–కె.వసంత్‌రెడ్డి(మెదక్) పై 21–10, 21–10 తేడాతో, డీఏ.అదిత్య(రంగారెడ్డి)–కె.భార్గవ్రామిరెడ్డి(ఖమ్మం)పై 21–15, 21–11 తేడాతో గెలపొందారు. బాలుర విభాగం డబుల్స్‌లో..: బి.రితిన్, టి.పవన్కష్ణ(ఖమ్మం)– కె.వర్షంత్రెడ్డి, పథ్వీకపూర్(హైదరాబాద్) 21–12, 21–15 తేడాతో, బీవీ.ఉన్నిత్కష్ణ, ఎస్.సాయిపథ్వీ(హైదరాబాద్), బి.యశ్వంత్రామ్, కె.రోహిత్‌రెడ్డి(హైదరాబాద్) 21–15, 15–21, 21–17 తేడాతో గెలుపొందారు. అశ్రయ్కుమార్, పి.సాకేత్‌రెడ్డి(రంగారెడ్డి) బి.నిఖిల్రాజ్, వి.నిఖిల్(హైదరాబాద్) 13–21, 21–17, 21–19 తేడాతో, ఎ.మోనిష్, జతిన్వర్మ(మెదక్)–డి.అభినవ్, టి.విఘ్నేష్(రంగారెడ్డి) 16–21, 21–18, 21–19 తేడాతో గెలిచారు.
అండర్15 బాలికలడబుల్స్లో..: కె.అభిలాష, ప్రణవి(హైదరాబాద్)–డి.అనుసోఫియా, వైసాయిశ్రియ(హైదరాబాద్)21–10, 21–11తేడాతో, కె.భార్గవి, వై.కైవల్యాలక్ష్మి(హైదరాబాద్)– సమీరా, వి.తనుశ్రీ(వరంగల్) 21–05, 21–0 తేడాతో నెగ్గారు.