బహుమతి అందుకుంటున్న రుత్విక శివాని
జాతీయ స్థాయి సీనియర్ ర్యాంకింగ్ టోర్నీ.. విజేత రుత్విక శివాని
Published Sun, Aug 7 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
ఖమ్మం స్పోర్ట్స్: మహిళల జాతీయస్థాయి సీనియర్ ర్యాకింగ్ టోర్నీలో ఖమ్మంకు చెందిన గాదె రుత్విక శివాని సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకొని విజేతగా నిలిచింది. మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 1నుంచి 6వ తేదీ వరకు జరిగిన ఆల్ ఇండియా సీనియర్ మహిళల సీనియర్ ర్యాకింగ్ టోర్నీలో నంబర్ వన్ ర్యాంకర్ పీసీ.తులసిని ఓడించడం విశేషం. సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రుత్విక శివాని మొదటి సెట్‌లో కొద్దిగా కష్టపడినప్పటికీ, రెండో సెట్‌ను తన చేతిలోకి తీసుకుని సునాయసంగా నెగ్గి సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈమ్యాచ్‌లో రుత్విక శివాని, పీసీ.తులసిపై 21–18, 21–06 తేడాతో గెలుపొందింది. రుత్విక శివాని రాణించడం పట్ల బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement