ఏపీలో 3990 ప్రభుత్వ పాఠశాలల మూసివేత | 3990 schools closed in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 3990 ప్రభుత్వ పాఠశాలల మూసివేత

Published Fri, Aug 7 2015 7:03 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

3990 schools closed in andhra pradesh

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 13 జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. టీపీఆర్ పద్ధతిలో రేషనలైజ్ నిర్వహించాలి. మండల స్థాయిలో వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. కిలో మీటర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 30 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తించాలి.

ఈ మేరకు 3 కిలో మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, 5 కిలో మీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలల జాబితా సిద్ధం చేయాలి. పాఠశాలలో వసతులు, విద్యార్థుల ఆధారంగా క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్క ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3,990 పాఠశాలలు మూత పడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement