నల్లకుబేరులకు మరో గోల్డెన్ ఛాన్స్ | Tax disclosure scheme to open tomorrow, close on March 31, 2017; disclosures to attract 50% tax and penalty: Revenue Secretary. | Sakshi
Sakshi News home page

నల్లకుబేరులకు మరో గోల్డెన్ ఛాన్స్

Published Fri, Dec 16 2016 5:15 PM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM

నల్లకుబేరులకు మరో గోల్డెన్ ఛాన్స్ - Sakshi

నల్లకుబేరులకు మరో గోల్డెన్ ఛాన్స్

న్యూఢిల్లీ: పన్ను ఎగవేత దారులకు కేంద్రం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది.  కొత్త  బ్లాక్ మనీ డిస్ క్లోజర్ పథకాన్ని  రెవెన్యూ కార్యదర్శి   హస్ముఖ్  ఆధియా   శనివారం ప్రకటించారు. ఇది రేపటినుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆదాయ వెల్లడికి గాను ఇచ్చిన ఈ అవకాశం  మార్చి 31, 2017తో ముగిస్తుందని వెల్లడించారు. 50 శాతం పన్ను, జరిమానాతో  ఈ గడువు లోపల ఆదాయాలను వెల్లడించాలని ఆయన సూచించారు.  ఇలా వెల్లడించిన ఆదాయ సమాచారాన్ని  బహిర్గతం చేయమని  అదియా పేర్కొన్నారు. దీనికి సంబంధించి పన్నుల చట్టం 2016 లోని రెండవ సవరణకు  దేశాధ్యక్షుడు  ప్రణబ్ ముఖర్జీ  ఆమోదం లభించిందని పేర్కొన్నారు.

నల్లదనం  వివరాలను ప్రజలు కూడా అందించవచ్చని తెలిపారు. దీనికోసం ఒక స్పెషల్ ఈ మెయిల్ ను కూడా క్రియేట్ చేసినట్టే కూడా ఆయన తెలిపారు.   కేంద్రం ప్రభుత్వం చేపట్టిన నల్లధనంపై పోరులో ప్రజలు సమాచారం అందించాలనుకున్నవారు  blackmoneyinfo@incometax.gov.in అనే మెయిల్ ఐడీకి  వివరాలు అందించాలని కోరారు. దీని ద్వారా ప్రభుత్వానికి ప్రజలు నల్లధనం సమాచారం అందించవచ్చని తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement