October Bank Holidays 2022: Banks To Remain Shut For 21 Days, Check Full RBI Holiday List - Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో బ్యాంకు సెలవుల లిస్ట్‌.. ఏకంగా 21 రోజులు

Published Fri, Sep 23 2022 5:36 PM | Last Updated on Fri, Sep 23 2022 7:51 PM

October Bank Holidays 2022 Banks to remain shut for 21 days check list - Sakshi

సాక్షి, ముంబై: పండుగల సమీపిస్తున్న నేపథ్యంలో అక్టోబరు నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకులు పనిచేయవు. రెండు,నాలుగు శనివారాలు, ఆదివారాలు సహా మొత్తం 21 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబరు నెలలో బ్యాంకులకు సెలవుల జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ప్రాంతీయ రాష్ట్రసెలవులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. సో కస్టమర్‌లు తమ సమీప బ్యాంకును సందర్శించే ముందు సెలవుల లిస్ట్‌ను చెక్‌ చేసుకోవచ్చు.
 
అక్టోబర్ 2022 నెలలో బ్యాంక్ సెలవుల లిస్ట్‌
అక్టోబరు 1, 2022- బ్యాంకు ఖాతాల అర్ధ వార్షిక ముగింపు (గ్యాంగ్‌టక్)
అక్టోబర్ 2, 2022- గాంధీ జయంతి, ఆదివారం
అక్టోబర్ 3, 2022- దుర్గా పూజ (అగర్తలా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ)
అక్టోబర్ 4, 2022- దుర్గాపూజ/దసరా/ఆయుధ పూజ/శ్రీమంత శంకరదేవ (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్ , తిరువనంతపురం)
అక్టోబర్ 5, 2022- దుర్గాపూజ/దసరా/శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం
అక్టోబర్ 6, 2022- దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
అక్టోబర్ 7, 2022- దుర్గా పూజ (గ్యాంగ్‌టక్)
అక్టోబర్ 8, 2022- రెండో శనివారం. మిలాద్-ఉల్-నబీ (భోపాల్, జమ్ము, కొచ్చి, శ్రీనగర్,  తిరువనంతపురం)
అక్టోబర్ 9, 2022- ఆదివారం
అక్టోబర్ 13, 2022- కర్వా చౌత్ (సిమ్లా)
అక్టోబర్ 14, 2022- ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ , శ్రీనగర్) 
అక్టోబర్ 16, 2022- ఆదివారం
అక్టోబర్ 18, 2022- కటి బిహు (గౌహతి)
అక్టోబర్ 22, 2022- నాల్గవ శనివారం
అక్టోబర్ 23, 2022- ఆదివారం
అక్టోబర్ 24, 2022- కాళీ పూజ/దీపావళి
అక్టోబర్ 25, 2022- లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన్ పూజ (గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్,  జైపూర్)
అక్టోబర్ 26, 2022- గోవర్ధన్ పూజ/భాయ్ దూజ్/దీపావళి/విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్‌టక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, సిమ్లా,  శ్రీనగర్)
అక్టోబర్ 27, 2022- భాయ్ దూజ్/లక్ష్మీ పూజ/దీపావళి (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్ మరియు లక్నో)
అక్టోబర్ 30, 2022- ఆదివారం
అక్టోబర్ 31, 2022- సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు/సూర్య పష్టి దాలా ఛత్/ఛత్ పూజ (అహ్మదాబాద్, పాట్నా, రాంచీ)
 
21 రోజుల పాటు బ్యాంకులు మూతపడినా ఆన్‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ సెలవు రోజుల్లో కస్టమర్‌లు బ్యాంక్ నుండి డబ్బును భౌతికంగా డిపాజిట్ చేయలేరు లేదా విత్‌డ్రా చేయలేరు. కానీ  ఇతర ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement